బెంగాల్‌లో పోలీసు వాహనం బోల్తా, 12 మందికి గాయాలు
కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. సింద్రి ఏరియాలో పోలీసు వాహనం బోల్తాపడింది. అయితే ఇదీ సాధారణ వాహనం అయితే విశేషం ఏమీ లేదు కానీ .. మందుపాతరల నిరోధక వాహనం బోల్తాపడటంతో ప్రమాదమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
12 మందికి గాయాలు
బరబాచర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనం పడిపోయింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తోపాటు మరో 21 మంది పోలీసులు ఉన్నారు. ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుట్రకోణం ?
ఎల్లుండి బెంగాల్‌లో ఆరో విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో మందుపాతర నిరోధక వాహనం బోల్తాపడటం ఆందోళన కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు జరిగే ప్రతీసారీ మావోయిస్టులు విరుచుకుపడుతున్నారు. ఈసారి ముందే పోలీసు వాహనం ప్రమాదం గురికావడం ఆ సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో గస్తీ పెంచామని .. పటిష్ట చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications