టీనేజీ యువతిపై అత్యాచారం, హత్య: ఉత్తర దినాజ్‌పూర్‌లో భారీ విధ్వంసం

కోల్‌కతా: ఓ టీనేజ్ యువతి హత్యాచారం ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్‌లో తీవ్ర విధ్వంసానికి దారితీసింది. ఆ యువతి మృతదేహాన్ని చూసిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత భారీ విధ్వంసానికి పాల్పడ్డారు.

ఉత్తరబెంగాల్-కోల్‌కతాను కలిపే జాతీయ రహదారిపై చేరుకున్న 200 మంది స్థానికులు రాకపోకలను అడ్డుకున్నారు. మూడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. ఓ పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. రాకపోకలకు అంతరాయం కలగడంతోపాటు పెను విధ్వంసం జరగడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.

మైనర్ యువతిపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారని పోలీసులు తెలిపారు. న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ వినకుండా విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు.

]

 Police vehicle, three buses set ablaze as violence engulfs in West Bengals North Dinajpur

ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు రావడంతో జనాలు మరింతగా రెచ్చిపోయారన్నారు. వారంతా విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)ను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆందోళనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంటే.. వారు పోలీసులపైకి బాంబులు విసిరారని తెలిపారు. మొదట పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. ఆ తర్వాత ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారని తెలిపారు.

లాఠీఛార్జీ చేసి, భాష్పావాయులను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టినట్లు వివరించారు. పోలీసులపై దాడులకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేశామని, అయితే, ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

స్థానిక బీజేపీ నేత సోదరి అయిన 16ఏళ్ల యువతిని ఫిరోజ్ అలీ అనే వ్యక్తి అత్యాచారం చేసి హతమార్చాడని బెంగాల్ బీజేపీ ఆరోపించింది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+