కాశ్మీర్‌లో కాల్పులు: పోలీస్ వీరమరణం, ముగ్గురు తీవ్రవాదుల హతం
జమ్ము కాశ్మీర్‌లోని త్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు వీరమరణం పొందాడు. ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. త్రాల్ పట్టణ శివారులో శనివారం సాయంత్రం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని త్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు వీరమరణం పొందాడు. ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. త్రాల్ పట్టణ శివారులో శనివారం సాయంత్రం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉగ్రవాదిని కూడా భద్రత దళాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గత ఏడాది ఎదురుకాల్పుల్లో మృతి చెందిన హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీకి అత్యంత సన్నిహితుడుగా భావిస్తున్న సబ్జార్ భట్‌తో పాటు, ఆకిబ్ అనే మరో ఉగ్రవాది ఈ సందర్భంగా భద్రతదళాలకు చిక్కినట్లు తెలుస్తోంది. త్రాల్‌లోని శిఖాగర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు.












Click it and Unblock the Notifications