రాఘవ లారెన్స్ రివర్స్ గేర్: పన్నీర్ సెల్వంకా, అంత సీన్ లేదు!

ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే స్టాయి స్టార్ తనకు లేదని,తాను పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నానని వస్తున్న వార్తలను రాఘవ లారెన్స్ ఖండించి రివర్స్ గేర్ వెయ్యడంతో ఆయనకు అప్పుడే రాజకీయాలు వంటపట్టాయని.

చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో నృత్యదర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రతి రోజు రాఘవ లారెన్స్ నానుతున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకున్నారు.

తన వాళ్లకు ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా తాను రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల లారెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలిసి తన పూర్తి మద్దతు ఆయనకే అని చెప్పారని మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు రాఘవ లారెన్స్ రివర్స్ గేర్ వేశారు. తాను పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నానని వస్తున్న వార్తలను రాఘవ లారెన్స్ ఖండించారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని రాఘవ లారెన్స్ తేల్చి చెప్పారు.

Political Drama: Actor Raghava Lawrence extends support to Panneerselvam.

ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే స్టాయి స్టార్ తనకు లేదని, తాను అంత పెద్ద నటుడు కాదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధాలు లేవని, తాను జల్లికట్టు క్రీడ నిర్వహించే విషయంలో సీఎం పన్నీర్ సెల్వంను అడగ్గా ఆయన వెంటనే అనుమతి ఇచ్చారని చెప్పారు.

అందుకు తాను కృతజ్ఞతలు చెప్పడానికి అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలిశానని రాఘవ లారెన్స్ వివరణ ఇచ్చారు. తమిళనాడు రాజకీయాలు గరంగరంగా మారడంతో పలువురు సినీ ప్రముఖులు పన్నీర్ సెల్వంను కలిసి మద్దతు ఇచ్చారు.

ఇదే సమయంలో రాఘవ లారెన్స్ పన్నీర్ సెల్వంను కలిశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ రివర్స్ గేర్ వెయ్యండంతో ఆయనకు అప్పుడే రాజకీయాలు వంటపట్టాయని తమిళనాడు ప్రజలు అంటున్నారు. మొత్తం మీద రాఘవ లారెన్స్ పన్నీర్ సెల్వం వర్గీయులను నిరాశపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+