Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bihar Politics: నితీష్ కుమార్ రాజీనామా అస్త్రం..బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు..?

బీహార్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. 2020లో నితీష్ కుమార్ ఎన్డీయేతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్డీయేను వీడి ఆర్జేడీ కాంగ్రెస్‌‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీతో విబేధాలు తారాస్థాయికి చేరడంతో 2022 ఆగష్టు 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. 2022 ఆగష్టు 10వ తేదీన తిరిగి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా నితీష్ కుమార్ మళ్లీ యూటర్న్ తీసుకుని ఎన్డీయే కూటమిలో చేరేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.

బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ఇది సోమవారం రోజున జరుగుతుందని బీహార్ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే గనుక జరిగితే నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 9వ సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లవుతుంది. ఇక బీహార్‌లో భారీగా బ్యూరోక్రాట్ల బదిలీలు జరుగుతుండటం ఈ అంశానికి బలాన్ని చేకూరుస్తోంది. మహాఘట్బందన్ కూటమికి బీటలు పడ్డట్టు ఈ ఎపిసోడ్‌తో స్పష్టమవుతోంది.

Political Turmoil:RJD and Congress Convene Urgent Party Meetings Amid Speculations of Nitish Kumars Alleged Switch

శనివారం రోజున లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ కోసం బీజేపీ ఓ సమావేశం నిర్వహించింది.ఇందులో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీష్‌తో పొత్తు వార్తలను ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి కొట్టిపారేశారు. అదే సమయంలో బీజేపీ నేతలే నితీష్‌తో తెరవెనుక చర్చలు జరుగుతున్నాయంటూ లీకులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రోజున నితీష్ కుమార్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.ఇక అన్ని జిల్లాల కలెక్టర్ల బదిలీలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటంతో నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టబోతున్నారనే వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి నితీష్ కుమార్ ఒక్కరే హాజరుకాగా, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ గైర్హాజరయ్యారు.దీంతో జేడీయూ ఆర్జేడీల మధ్య బంధం చెడిందనే సంకేతాలు వెళ్లాయి. రాజకీయాల్లో తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయంటూ బీజేపీ నేత సుశీలు కుమార్ మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్లలోనే నితీష్ కుమార్ స్థిరత్వం కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

243 అసెంబ్లీ సీట్లున్న బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. అయితే 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీకి 79 సీట్లు, బీజేపీకి 78 సీట్లు, జేడీయూకు 45 సీట్లు, కాంగ్రెస్‌కు 19, సీపీఐ (ఎం-ఎల్) 12, సీపీఎం,సీపీఐలకు చెరో రెండు సీట్లు, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్)కు 4 సీట్లు, మజ్లిస్‌కు ఒకటి, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. దీంతో నితీష్ కుమార్ కింగ్‌మేకర్‌గా నిలిచి నాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+