షాకింగ్: నాటి డిప్యూటీ సీఎం.. నేడు దీనస్థితి(వీడియో)
ముంబై: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఎన్సీపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్‌కి సంబంధించి చిత్రం ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆయన దాదాపు 10 కేజీల బరువు తగ్గారని తెలుస్తోంది.
పెరిగిన జుట్టు, నెరసిన తెల్లటి గడ్డంతో చాలా బలహీనంగా కనిపిస్తున్న ఆయన.. ఇప్పటి చిత్రానికి, ఆయన పాత చిత్రాన్ని జతచేసిన ఫొటో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలు చూసిన మహారాష్ట్రవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

'ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు' అంటూ చర్చించుకుంటున్నారు. కాగా, అనారోగ్యంతో ఉన్న ఆయనను శనివారం ముంబైలోని సెయింట్ జార్జి ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆరువారాల క్రితం వరకు మహారాష్ట్రలో ధనవంతుడైన, శక్తిమంతుడైన రాజకీయ నాయకుడిగా ఉన్న భుజ్‌బల్ జీవితం అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా దీనంగా మారిపోయింది.
గతంలో భుజ్‌బల్ పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రూ. 870కోట్ల మనీలాండరింగ్‌కి సంబంధించిన కేసులో ఈడీ ఆయనను మార్చిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పంటి నొప్పి, ఛాతినొప్పితో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications