కాగితాలకే పరిమితమైన 200 పార్టీలు, ఆ పార్టీల ఆదాయాలను పరిశీలించాలని లేఖ
కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీల ఆదాయ వ్యయాలను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ సిబిడిటికి లేఖ రాయనుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా కాగితాలకే పరిమితమై విరాళాలను తీసుకొంటు నల్లధనాన్ని మార్
న్యూఢిల్లీ :రెండు వందల రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకొనేందుకు ఎన్నికల కమీషన్ సమాయత్తమైంది. రాజకీయ పార్టీల ముసుగులో నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఎన్నికల కమీషన్ గుర్తించింది. ఈ పార్టీల ఆదాయ వ్యయాలపై కన్నువేయాలని ఎన్నికల కమీషన్ ఆదాయపు పన్ను శాఖ ను కోరింది.మరో వైపు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యక్తుల సమాచారాన్ని ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని కేంద్ర న్యాయశాఖను కోరింది కేంద్రఎన్నికల కమీషన్.
దేశంలోని ఎన్నికల కమీషన్ వద్ద ఏడు జాతీయ పార్టీలు, 58 ప్రాంతీయ పార్టీలు, మరో 1780 ఇతర పార్టీలు నమోదై ఉన్నాయి. అయితే ఎన్నికల కమీషన్ వద్ద నమోదై ఉన్న పార్టీల్లో ఎక్కువగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

కాగితాలకే పరిమితమైన పార్టీలు
ఎన్నికల కమీషన్ వద్ద నమోదైన పార్టీల్లో ఎక్కువగా కాగితాలకే పరిమితమయ్యాయి. కనీసం చిన్న చితకా ఎన్నికల్లో కూడ ఆ పార్టీలో పోటీచేయడం లేదు. కాని రాజకీయపార్టీలకు ఉన్న వెసులుబాటును అనుసరించి ఆయా పార్టీలు నల్ల ధనాన్ని మార్పిడి చేసుకొంటున్నాయనే అనుమానాన్ని ఎన్నికల కమీషన్ వ్యక్తం చేస్తోంది.
అయితే దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డుకు లేఖ రాయాలని భావిస్తోంది.
సుమారు రెండు వందల పార్టీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2005 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడ పాల్గొనకుండా కాగితాలకే పరిమితమై పార్టీలను గుర్తించింది ఎన్నికల కమీషన్.వీటిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారంగా 20 వేల రూపాయాల లోపు విరాళాలు ఇచ్చే వ్యక్తుల సమాచారాన్ని రాజకీయ పార్టీలు బయటపెట్టాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని ఈ పార్టీలు నల్ల ధనాన్ని మార్పిడి చేసుకొంటున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే ఈ నిబంధనను సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర న్యాయశాఖను కోరింది.
రెండు వేల రూపాయాలకు పై బడిన మొత్తాన్ని అందించే వారి వివరాలను బయటకు వెల్లడించేలా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.












Click it and Unblock the Notifications