'హర్యానా'లో పాగా వేసేదెవరు..?

Haryana Assembly Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంది. బరిలో మొత్తం 1031 మంది అభ్యర్థులు నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరుగకుండా పోలీసులు పటిష్ట భదత్ర ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారు.

ఇక హర్యానాలో పాగా వేయాలని మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇక్కడ బీజీపీ - కాంగ్రెస్ - ఆప్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా, మెజారిటీకి 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లపై త్రికోణ పోటీ నెలకొంది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం నిర్వహించాయి.

Polling starts in Haryana Assembly Elections

అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కింగ్ మేకర్‌గా మారింది. ఈసారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నాయకులు. పలు పార్టీల కీలక నేతలు పార్టీలో చేరడంతో కాంగ్రెస్ నాయకులు ఫుల్ జోష్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అయితే అగ్నివీర్ పథకం, నిరుద్యోగం, రైతాంగం, నిత్యావసర ధరలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 స్థానాలను గెలుచుకున్నాయి. హర్యానాలో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరి హర్యానా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలంటే అక్టోబర్ 8 వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+