పోర్న్‌కు బానిస: తల్లిపై అత్యాచారయత్నం, అందరి ముందే అశ్లీల చిత్రాల వీక్షణ
అహ్మదాబాద్: మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఫోర్న్‌కు బానిసగా మారిన ఓ యువకుడు కన్నతల్లిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.అయితే ఈ విషయమై బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఫోర్న్‌కు బానిసగా మారిన ఓ యువకుడు తల్లిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్‌టౌన్‌లో చోటుచేసుకొంది. గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ టౌన్‌లో రాకేష్ కుటుంబం నివసిస్తోంది. రాకేష్ తండ్రి తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. ఈ పని కోసం ఆయన పలు ప్రాంతాలకు తిరుగుతుంటాడు.
అయితే రాకేష్ సోదరుడు అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.అయితే తల్లి, సోదరితో కలిసి రాకేష్ అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రాకేష్ ఫోర్న్‌కు బానిసగా మారాడు.

పోర్న్‌కు బానిసగా మారిన యువకుడు
గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్‌టౌన్‌లో నివాసం ఉండే రాకేష్ అనే 22 ఏళ్ళ యువకుడు పోర్న్‌కు బానిసగా మారాడు. నిత్యం సెల్‌ఫోన్లలో అశ్లీల దృశ్యాలను చూస్తుండేవాడు. రోజులో ఎక్కువ సేపు ఫోన్ పట్టుకొని నీలి చిత్రాలు చూసేందుకు సమయాన్ని కేటాయించేవాడు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా రాకేష్ కుటుంబసభ్యులు గ్రహించారు. అతడికి బుద్ది చెప్పారు. కానీ , అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

తల్లిపై రేప్‌కు ప్రయత్నం
పోర్న్‌కు బానిసగా మారిన రాకేష్ తల్లిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. గురువారం రాత్రి పూట మంచినీళ్ళు తాగేందుకు తల్లి గదిలోకి వెళ్ళిన రాకేష్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తల్లి, కొడుకులు తరచూ గొడవపడేవారు. అయితే తనపై అత్యాచారాన్ని ప్రతిఘటించేందుకుగాను బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అయితే ఆమె యధావిధిగా తల్లి కొడుకులు గొడవపెట్టుకొంటున్నారని మాత్రమే భావించారు. కానీ, ఉదయం పూట అసలు విషయాన్ని బాధితురాలు బయట పెట్టింది.

మా ముందే పోర్న్ వీడియోలు చూసేవాడు
రాకేష్ కుటుంబసభ్యుల ముందే కొన్నిసమయాల్లో పోర్న్ వీడియోలను చూసేవాడని బాధితులు చెబుతున్నారు. ఆ వీడియోలను తమకు కన్పించేలా ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పాట్లు చేసేవాడని చెప్పారు. అంతేకాదు తమను కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేసేవాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అశ్లీల వీడియోలు చూసే ఇలా
అయితే తల్లిపై అత్యాచారానికి ప్రయత్నించడానికి ముందు వరకు నిందితుడు రాకేష్ తన ల్యాప్‌టాప్‌లో అశ్లీల వీడియోను చూశాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడి నుండి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఐపీసీ 376, 507సెక్షన్ల ప్రకారం రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications