ప్రభుత్వ అభివృద్ది పనులు ఇవే: మునిసిపాలిటి ఆఫీస్ లో పొర్న్ సినిమా చూపించి!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ?, అభివృద్ది పనులు ఎలా జరుగుతున్నాయి ? అని ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బంది నిర్లక్షం కారణంగా ఏకంగా నీలి చిత్రం (బ్లూ ఫిల్మ్) ప్రదర్శించారు.
మహిళలు, వృద్దులు ఉన్నారనే సంస్కారం లేకుండా కర్ణాటకలోని మడికేరి నగరసభ (మునిసిపాలిటి) సిబ్బంది ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జులై 6వ తేదీన మడికేరి నగర సభ కార్యాలయంలో ప్రజా సదస్సు ఏర్పాటు చేశారు.

ఆ సమావేశంలో ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ?, అభివృద్ది పనులు ఎలా జరుగుతున్నాయి అని వివరించడానికి ఓ వీడియో తయారు చేసి ప్రజలకు చూపించడానికి సిద్దం అయ్యారు. సమావేశ మందిరంలో అందరూ కుర్చుని ఉన్నారు.
ప్రోజెక్టర్ ఆన్ చేశారు. తెర మీద మాత్రం ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ?, అభివృద్ది పనులు ఎలా జరుగుతున్నాయి అని సమాచారం ఉన్న క్లిప్పింగ్స్ కనపడలేదు. ఏకంగా నీలి చిత్రాలు దర్శనం ఇచ్చాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మడికేరి నగరసభ అధికారి మొహమ్మద్ మునీర్ కుఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications