బస్ స్టేషన్‌లోని టీవీలో పోర్న్ వీడియో, వ్యక్తి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ఓ బస్ స్టేషన్లో అనుకోని సంఘటన జరిగింది. దీంతో, ప్రయాణీకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బస్టాండులోని ప్రయాణీకులను ఉల్లాసపరిచేందుకు టీవీలలో పోర్న్ చిత్రం ప్రసారమైంది. దీంతో ప్రయాణీకులు అవాక్కయ్యారు.
ఈ సంఘటన కాల్పేట పట్టణంలోని బస్ స్టేషన్లో జరిగింది. బస్ స్టేషన్‌లోని టీవీలలో ఒక్కసారిగా అశ్లీల దృశ్యాలు వచ్చాయి. సమాచారాన్ని అధికారులకు, పోలీసులకు అందించారు.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేబుల్ ఆఫరేటర్‌ది తప్పు అని తేల్చారు. అతడు వాణిజ్య ప్రకటనల క్లిప్పింగుకు పోర్న్ చిత్రాన్ని జత చేశాడని తెలిపారు. ఆ కేబుల్ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని బుధవారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. తాను పొరపాటున అది వేసినట్లు అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications