రసిక రాజా: Porn వీడియోలు చూస్తూ అసెంబ్లీలో అడ్డంగా దొరికిన ఎమ్మెల్సీ..!
చట్టసభలో కూర్చొని జనానికి సంబంధించిన పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు.. హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయి పోర్న్ వీడియోలు చూడటం కర్ణాటకలో పరిపాటిగా మారింది. బడ్జెట్ సమావేశాలు సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో మరోసారి జుగుప్సాకరమైన సంఘటన చోటుచేసుకుంది. విచిత్రంగా దీనిపై రాజకీయ పార్టీలు ఒకరినొకరు ప్రశ్నించుకోలేని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..

పోర్న్ గేట్ 2.0
రెండు విడతలుగా నిర్వహిస్తోన్న కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభంకాగా, తొలిరోజే ప్రభుత్వం 11 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వీటిపై రెండోరోజైన శుక్రవారం అసెంబ్లీలో, మండలిలో కీలక చర్చ జరిగింది. అయితే బిల్లులపై చర్చ జరుగుతోన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దీన్ని పోర్న్ గేట్ 2.0గా మీడియా, సోషల్ మీడియా అభివర్ణిస్తోంది. కాగా,

అబ్బే.. మెమరీ నిండిపోతేనూ..
శాసన మండలిలో కూర్చొని తన సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ చర్యపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇందుకా మిమ్మల్ని చట్టసభలకు పంపింది? అని నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. రాజకీయవర్గాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో రాథోడ్ స్పందించారు. మొబైల్ ఫోన్ లో మెమరీ నిండిపోగా, అనవసరంగా స్టోరైన వీడియోలను డిలిట్ చేశానే తప్ప పోర్న్ చూడలేదని ఆయన వాదించారు..

ప్రశ్న అడగటానికే ఫోన్ తీసుకెళ్లా..
''సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఎమ్మెల్యేలుగానీ, ఎమ్మెల్సీలుగానీ సభలోపలికి సెల్ ఫోన్లను తీసుకెళ్లం. కానీ ఇవాళ నేనొక ముఖ్యమైన ప్రశ్నను అడగాల్సి ఉంది. అందుకోసమే మొబైల్ ను సభలోకి తీసుకెళ్లాను. ఫోన్ లో మెమరీ నిండి ఉండటంతో, అవసరం లేని వీడియోలను డిలిట్ చేశాను. దీనిపై రచ్చ అనవసరం'' అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ వివరణ ఇచ్చారు. కాగా.

పోర్న్‌పై బీజేపీ గప్‌చుప్
అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీపై విమర్శలు చేయడానికి అధికార బీజేపీ సాహసించకపోవడం గమనార్హం. ఎందుకంటే బీజేపీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ సవాది.. 2012లో ఇదే అసెంబ్లీ వేదికగా పోర్న్ వీడియో చూస్తూ పట్టుపడ్డారు. ఆ సందర్భంలోనూ తాను వీడియోలు చూడలేదని ఆయన అడ్డంగా వాదించారు. ప్రస్తుత యడ్యూరప్ప కేబినెట్ లో లక్షణ్ సవాది డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. గతంలో తమ పార్టీ నేత చేసిన పనినే ఈసారి పక్క పార్టీ నేత చేయడంతో రెండు పార్టీల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా మారింది. అయితే..

పెద్దల సభలో తప్పుడు పనులు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పోర్న్ వీడియో ఉదంతంపై కర్ణాటక బీజేపీ అధికార ప్రతినిధి ఎస్.ప్రకాశ్ స్పందించారు. పెద్దల సభగా పేరుపొందిన శాసన మండలిలో తప్పుడు పనులు చోటుచేసుకోడం గర్హనీయమని, గతంలో బీజేపీ నేత(లక్ష్మణ్ సవాది)ను ఉద్దేశించి కాంగ్రెస్ రచ్చ సృష్టించిందని, ఇప్పుడేమో అదే పార్టీకి చెందిన నేత సభలోపల పోర్న్ చూస్తూ పట్టుపడ్డాడని ప్రకాశ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో బీజేపీ ఎలాంటి డిమాండ్లు చేయబోదని, సదరు నేతపై చర్యలు తీసుకోవాల్సింది కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమారే అని ఎస్.ప్రశాశ్ పేర్కొన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications