నాథూరాం గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన ... ప్రజ్ఞాసింగ్

మహాత్మగాంధిని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మరోసారి వివాదంలో చిక్కుకున్నబోపాల్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వక్రికరించారని అవి గాడ్సే పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని పేర్కోన్నారు.తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు.

pragya sing thakur said sorry comments on Nathuram Godse

కాగా మహాత్మగాంధిని చంపిన గాడ్సే తోలిహిందు తీవ్రవాదీ అంటూ నటుడు కమలహాసన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే బోపాల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ గాడ్సేను దేశభక్తుడంటూ కీర్తించింది. దీంతో ఆమే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాజకీయ పార్టీలు నుండి ఆమే విమర్శలు ఎదుర్కోంది.

దీంతోపాటు బీజేపీ సైతం ఆమే వ్యాఖ్యలతో ఏకిభవించకపోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. దీంతో సాధ్వీ వెనక్కి తగ్గారు. ఆమే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు. మరోవైపు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+