ప్రకాశ్ రాజ్: 'మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, రౌడీయిజం చేశారు'

'మా' అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన తమ ప్యానల్ మెంబర్స్ 11 మంది రాజీనామా చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ పోస్టుల్లో మీకు కావాల్సిన వారిని నియమించుకుని స్వేచ్ఛగా పని చేయాలని కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ సూచించారు.
అసోసియేషన్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ అన్నారు.
'మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రౌడీయిజం చేశారని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.
అందరినీ కలుపుకుపోయే తత్వం మంచు విష్ణులో ఉందని తాము భావించడం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. విష్ణుతో కలిసి పని చేసే వాతావరణం కనిపించడం లేదని ఎన్నికైన తమ ప్యానల్ సభ్యులు భావిస్తున్నారని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.
ఇది బాధతో చేసిన రాజీనామాలు కావని, వీటిని ఆమోదించాలని, ఓటేసిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టాలని కొత్త అధ్యక్షుడు విష్ణుకు ప్రకాశ్ రాజ్ సూచించారు.
తమ ప్యానల్‌లో ఉన్నవారంతా ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవారని, వారు అసోసియేషన్‌లో ఉంటే నిత్యం గొడవలే అవుతాయని ప్రకాశ్ రాజ్‌తోపాటు, నటుడు శ్రీకాంత్ కూడా అన్నారు.
తెలుగువాడు కానివాడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ అసోసియేషన్ బైలాస్‌లో మార్పులు చేయకుండా ఉంటానని హామీ ఇస్తే అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామను ఉపసంహరించుకుంటానని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.
ఓటేయడానికి మాత్రమే నా సభ్యత్వం అవసరమనుకుంటే అసోసియేషన్‌లో ఉండబోనని ఆయన తేల్చి చెప్పారు.
తమ ప్యానల్ సభ్యుల పట్ల మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారని, దాడికి ప్రయత్నించారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడు, నటుడు బెనర్జీ ఆరోపించారు. అసోసియేషన్ పెద్దలు కూడా ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించలేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'
- 'మా' సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా
- విరాట్ కోహ్లీ: 'కింగ్ ఈజ్ బ్యాక్.. ధోనీ మరోసారి ఎగిరి గంతేసేలా చేశాడు’
- 'వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- చైనా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- డన్‌కర్క్: 'చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications