అభివృద్ధా? గూండాయిజమా?: విగ్రహాల ధ్వంసంపై ప్రకాష్ రాజ్ నిప్పులు..
బెంగళూరు: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ గత కొంతకాలంగా బీజేపీకి, ప్రధాని మోడీకి ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ వస్తున్న నటుడు ప్రకాష్ రాజ్.. మరోసారి కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.దేశవ్యాప్తంగా ప్రగతిశీల వ్యక్తుల విగ్రహాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తుండటంపై తాజాగా ఆయన స్పందించారు.
మీ ఎజెండా ఏంటి?
లెనిన్.. పెరియార్.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ.. విగ్రహాల ధ్వంసాన్ని గుర్తుచేసిన ఆయన.. అసలు మీ ఎజెండా ఏంటి? అని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏం చెప్పదలుచుకున్నారు?
ఇలా చేయడం ద్వారా చిన్నారులకు ఏం చెప్పదలుచుకున్నారు. ఇకనైనా ఈ విగ్రహాలను ధ్వంసం చేసే రాజకీయాలను ఆపాలని చేతులెత్తి కోరుతున్నట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు.

గూండాయిజమా?
హింసామార్గంలో వెళితే మరింత హింసను చూడాల్సి వుంటుందని, మీ ఎన్నికల మ్యానిఫెస్టో గూండాయిజాన్ని పెంచి పోషించడమా? లేక అభివృద్ధా? అంటూ నిప్పులు చెరిగారు.
Recommended Video


అంబేడ్కర్.. లెనిన్.. పెరియార్..
కాగా, త్రిపుర ఎన్నికల్లో గెలుపు అనంతరం అక్కడి కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆపై బీజేపీ నేత హెచ్.రాజా చేసిన కామెంట్స్ తో తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా కొంతమంది ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాల్సిందిపోయి.. నిరసన తెలిపినవాళ్లనే అరెస్ట్ చేయడం గమనార్హం.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications