ఆత్మగౌరవమా నీవెక్కడ..? బండి సంజయ్ ఇష్యూపై ప్రకాశ్ రాజ్
అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించడంపై అగ్గిరాజేసింది. ఈ అంశాన్ని విపక్షాలు ఏకిపారేశాయి. ఢిల్లీ గులాములకు సేవలు అంటూ విమర్శలు చేస్తున్నాయి. దీనిపై బండి సంజయ్ కూడా కౌంటర్ అటాక్ చేశారు. ఇప్పుడు నటుడు ప్రకాశ్ రాజ్ వంతు వచ్చింది. ఆయనకు స్వతహాగానే బీజేపీ, ప్రధాని మోడీ అంటే గిట్టదు.. ఇప్పుడు అమిత్ షాకు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆ వీడియోను పంచుకొని ట్వీట్ చేశారు.
ఆత్మగౌరవమా నీవెక్కడ..?
తెలుగు జాతి నినాదం ఆత్మగౌరవంతో బతకడం. ఎవరికీ గులాం గిరీ చేయొద్దు. ఇదే నినాదంతో పార్టీలు ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి సలాం చేసే పరిస్థితి ఉండొద్దు అని చెబుతారు. కానీ నిన్న అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. దీంతో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది.
వీళ్లా తెలుగువారీ ఆత్మగౌరవాన్ని కాపాడేది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. సిగ్గుండాలి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీపై ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి విరుచుకుపడ్డారు. ట్వీట్‌కు బండి సంజయ్ చెప్పులు ఇస్తోన్న వీడియో యాడ్ చేశారు. ఛీ ఛీ అంటూ తనదైనశైలిలో ప్రకాశ్ రాజ్ ఫైరయ్యారు.

మోడీ అంటే గిట్టదు
మోడీ అంటే ప్రకాశ్ రాజ్‌కు గిట్టదు. మోడీ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తారు. దేశంలో అశాంతికి కారణం వారేనని పేర్కొంటారు. ఇప్పుడు మరోసారి అవకాశం రాగా.. విరుచుకుపడ్డారు. తెలుగువారు ఇలా చేస్తారా అని ఫైరయ్యారు. గుజరాతీ, ఢిల్లీలకు సలాం చేయాల్సిందేనా అంటూ మండిపడ్డారు.

కేసీఆర్‌తో సాన్నిహిత్యం
ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు.. మంచి పేరు సంపాదించారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇదివరకు రాజ్యసభ ఆఫర్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ సామాజిక సమీకరణాల వల్ల వీలుపడలేదు. అయినప్పటికీ ప్రకాశ్ రాజ్ మాత్రం.. బీజేపీపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మోడీ, కేంద్రంపై ప్రకాశ్ రాజ్ ఫైర్ అవుతూనే ఉంటారు.

ఇదివరకు నడ్డాకు
ఇప్పుడే కాదు.. ఇదివరకు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. రోడ్ షోలో భాగంగా చినుకులు పడుతుంటే అడ్డుగా బండి సంజయ్ పెట్టారు. ఇదే విషయాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు అమిత్ షా ఇష్యూ రావడంతో.. ఢిల్లీ, గుజరాత్‌కు గులాంగిరీ చేస్తున్నారని విమర్శలు మరింత ఎక్కువ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications