రాష్ట్రపతి కుమార్తెకు లైంగిక వేధింపులు..
న్యూఢిల్లీ : హోదా.. స్థాయిలతో నిమిత్తం లేకుండా దేశంలో చాలామంది మహిళలు లైంగిక వేధింపుల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా సాక్షాత్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సైతం లైంగిక వేధింపుల బారిన పడడం.. దేశంలో మహిళల స్థితిగతులను అద్దం పడుతోంది.
ఓ ఆకతాయి ఫేస్ బుక్ లో తనను వేధించిన విషయాన్ని ఫేస్ బుక్ ద్వారానే బహిర్గతం చేసింది రాష్ట్రపతి కుమార్తె, రాజకీయవేత్త షర్మిష్ట ముఖర్జీ. సదరు ఆకతాయి అసభ్యకర మెసేజ్ లతో తనను ఇబ్బందిపెట్టిన వైనాన్ని ఫేస్ బుక్ పోస్టులో వివరించారు షర్మిష్ట.
తొలుత ఈ విషయాన్నిఅంతగా పట్టించుకోలేదని.. అయితే ఇలాంటి ఆకతాయిలను ఇలాగే వదిలేస్తే.. వాళ్లను మనమే ప్రోత్సహించినట్టవుతుందన్నఉద్దేశంతో అతగాడి నిర్వాకాన్ని బట్టబయలు చేశానని చెప్పుకొచ్చింది షర్మిష్ట. కాగా, సదరు ఆకతాయి అత్యంత నీచంగా షర్మిష్టకు పంపిన మెసేజ్ లపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నమహిళలంతా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications