మందు బాబులకు ప్రశాంత్ కిశోర్ గుడ్‌న్యూస్: కొత్త పార్టీ ‘జన్ సురాజ్’
పాట్నా: దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ తాజాగా కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు. బీహార్ రాజధాని పాట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన తన పార్టీ 'జన్ సురాజ్'ను అధికారికంగా ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్, మాజీ దౌత్యవేత్త పవన్ వర్మ, మాజీ ఎంపీ హస్సన్ సమక్షంలో పార్టీని ప్రారంభించారు.
జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐఏఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు. విద్య, ఉపాధి అవకాశాల ప్రాధాన్యాల గురించి బీహారీలకు వివరించి ఓట్లు అడుగుతామని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలంగా ఉందని, ఎన్నికల సంఘం ఆమోదం పొందిందని తెలిపారు. దీంతో బీహార్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పారు.

కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే, ఈ పార్టీకి నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. రెండేళ్లుగా దీని కోసం శ్రమించిన వారే ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గత 30 ఏళ్లుగా బీహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతం కావాలన్నారు.
తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. బీజేపీతో కలిసి తమ పార్టీ పనిచేస్తుందంటూ కొన్ని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాగా, రెండేళ్ల క్రితం బీహార్‌లో 'జన్ సురాజ్' యాత్రను ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన చంపారణ్ జిల్లా నుంచే 3,000 కి.మీ పాదయాత్రను చేపట్టారు. సరిగ్గా పాదయాత్రను ప్రారంభించిన రెండేళ్ల తర్వాత పార్టీని ఇప్పుడు ప్రారంభించారు.
మద్యపాన నిషేధం ఎత్తివేస్తాం
జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. మద్యపాన నిషేధం వల్ల ఏటా రూ.20 వేల కోట్ల ఖజానాకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే గంటలో మద్యపానంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
#WATCH | Patna, Bihar | Jan Suraaj founder Prashant Kishor officially launched his political party - Jan Suraaj Party.
— ANI (@ANI) October 2, 2024
He says, "If Bihar has to have a world-class education system, Rs 5 lakh crore is needed in the next 10 years. When the liquor ban will be removed, that money… pic.twitter.com/w8Og4Cn2NX
బీహార్‌ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రానున్న పదేళ్లల్లో రూ.5 లక్షల కోట్లు అవసరమన్నారు. ఈ మద్యపాన నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చిన సొమ్మును బడ్జెట్‌కు, నేతల భద్రత, రోడ్లు, నీళ్లు, విద్యుత్‌కు మళ్లించమని తెలిపారు. బీహార్ విద్యా వ్యవస్థ నిర్మాణానికి మాత్రమే ఖర్చు చేస్తామని ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications