ప్రశాంత్ కిషోర్‌కు నితీష్ కేబినెట్ పదవి తప్పుకాదు: సుప్రీం కోర్టు

2014లో బీజేపీ గెలుపుకు, రెండేళ్ల క్రితం బీహార్‌లో మహా కూటమి గెలుపుకు వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీషఅ కుమార్ కెబినెట్ హోదా ఇవ్వడం తప్పేమీ కాదని సుప్రీం కోర్టు తెలిపింది.

పాట్నా: 2014లో బీజేపీ గెలుపుకు, రెండేళ్ల క్రితం బీహార్‌లో మహా కూటమి గెలుపుకు వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీషఅ కుమార్ కెబినెట్ హోదా ఇవ్వడం తప్పేమీ కాదని సుప్రీం కోర్టు తెలిపింది.

ముఖ్యమంత్రికి ఆయనపై నమ్మకం ఉందని, ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహార్‌ స్పష్టం చేశారు.

Prashant Kishor Can Keep Cabinet Minister Status In Bihar: Supreme Court

కిశోర్‌ కేబినెట్‌ హోదాపై ఓ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు న్యాయస్థానం పైవిధంగా బదులిచ్చింది. మూడేళ్లుగా ప్రశాంత్‌ కిశోర్‌ పేరు సుపరిచితం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉంటూ కీలక సలహాలిచ్చారు. మోడీ హవాకు, ఆయన వ్యూహ ప్రతివ్యూహాలు తోడవడంతో ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.

ఆ తర్వాత 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాకుండా నితీశ్ కుమార్‌ జేడీయూ, లాలూ ప్రసాద్‌యాదవ్‌ ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి ఏర్పడిన మహా కూటమికి వ్యూహకర్తగా వ్యహరించారు. నితీశ్‌ వెన్నంటే ఉండి ఆయనను విజయం దిశగా నడిపించారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. ఇందుకు కృతజ్ఞతగా ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ హోదా కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+