రూ.9 కోట్లు తీసుకున్న అతనెక్కడ: నితీశ్‌కు బీజేపీ

పాట్నా: ముఖ్యమంత్రి సలహాదారు పదవిలో నియమించి రూ.9 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు చాలా రోజులుగా ఆయన కనిపించడం లేదని, అతను ఏమై పోయాడని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు.

బీహార్ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్‌కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. ప్రస్తుతం అతను ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు.

Prashant Kishor is absent for long, remove him: BJP

బీహార్‌లో మహా కూటమిని (కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయు) అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు టెక్ సాయం చేసిన ప్రశాంత్ కిశోర్‌ను నితీశ్ తన సలహాదారుగా నియమించుకున్నారు. బీహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతలను నితీశ్ సర్కారు ప్రశాంత్‌కు అప్పగించింది.

అందుకు ఆయనకు ప్రతిఫలంగా రూ.9.31 కోట్లను కూడా ప్రభుత్వం ఇచ్చింది. అయితే, నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ప్రశాంత్ ఆ రాష్ట్రానికి వచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. అలాంటి వ్యక్తికి వేతనం ఇవ్వడం ఏమిటని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నించారు. తక్షణమే అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+