"రేవంత్ రెడ్డి బిహార్ లోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కర్రలతో తరిమి కొడతారు"

ఈ ఏడాది చివర్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్​ అధికార్ యాత్ర చేపట్టింది. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని.. ఓట్ల చోరీ జరుగుతోందని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు ప్రియాంకా గాంధీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే బిహార్ ప్రజలపై గతంలో సీఎం రేవంత్ చేసిన డీఎన్ఏ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ పై జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీహార్ డీఎన్ ఏ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై జాతీయ స్థాయి నాయ‌కులు మండిప‌డ్డారు. బీహార్ డీఎన్ ఏ ను కాద‌ని తెలంగాణ డీఎన్ ఏను ప్ర‌జ‌లు ఎన్నుకున్నార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో బీహార్ ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా రేవంత్ వ్యాఖ్యానించార‌ని ఆ రాష్ట్ర నాయ‌కులు తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. తన డీఎన్ ఏ తెలంగాణ‌ అని కేసీఆర్ డీఎన్ ఏ బీహార్‌ ది అని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పూర్వీకులు బీహార్‌ కు చెందిన‌వారని.. అక్కడినుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ల‌స వచ్చి, అనంత‌రం తెలంగాణ‌లో స్థిర‌ప‌డ్డారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బిహార్ లో పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు..? బీహార్‌ లో ఆయనకు ఏం పని..? బిహార్ లో ఆయన హోదా ఏంటి? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓటర్ అధికార్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంపై ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు.

Prashant Kishor Slams Telangana CM Revanth Reddy Warns of Bihar Village Backlash

"అసలు రేవంత్ రెడ్డి ఎవరు..? ఆయనకు బిహార్ లో ఏం పని..? ఎన్నికల సమయంలో బిహార్ ప్రజలను అవమానించేలా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ అదే బిహార్ కు ఓట్లు అడిగేందుకు వచ్చారు. రేవంత్ రెడ్డి బీహార్‌ లోని ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు కర్రలతో తరిమి తరిమి కొడతారు. అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ తన వేదికపైకి పిలుచుకున్నారు. బిహార్ ను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటే.. ఇది రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది" అని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+