బీజేపీ సర్కారా, ఎన్డీయే సర్కారా ? ప్రశాంత్ కిషోర్ కు భిన్నంగా యోగీంద్ర యాదవ్ జోస్యం..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆరో దశ కొనసాగుతోంది. వచ్చే నెల 1న జరిగే తుది దశ పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా ఈసారి కేంద్రంలో ఫలితాలు రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రధాని మోడీ విపక్షాలపై తీవ్ర స్ధాయిలో మాటలదాడి చేస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనదైన స్ధాయిలో జోస్యం చెప్పారు. అయితే దీంతో సెఫాలజిస్ట్ యోగీంద్ర యాదవ్ విభేదించారు.
కేంద్రంలో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం విపక్షాలతో పోలిస్తే ఎన్డీయేకే ఉందని ప్రశాంత్ కిషోర్, యోగీంద్ర యాదవ్ ఇద్దరూ అంగీకరించారు. అయితే అది బీజేపీ ఒంటరిగానే ఏర్పాటు చేస్తుందా లేక మిత్రపక్షాల సాయంతో ఏర్పాటు చేస్తుందా అన్న విషయంలో వీరిద్దరూ భిన్న జోస్యాలు చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ లెక్కల ప్రకారం కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. అయితే బీజేపీకి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ వస్తుందన్నారు. అయితే యోగీంద్ర యాదవ్ మాత్రం మిత్రపక్షాల సాయం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు.

ప్రశాంత్ కిషోర్ జోస్యం ప్రకారం బీజేపీ కేంద్రంలో 370 సీట్లు ఒంటరిగానే సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కానీ ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నట్లు 400 సీట్లు మాత్రం అసాధ్యమన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బీజేపీ స్కోరు 270 సీట్లకు తగ్గదన్నారు. అయితే యోగీంద్ర యాదవ్ మాత్రం బీజేపీకి ఈసారి 260 సీట్లకు మించి రావన్నారు. కనిష్టంగా 250 సీట్లకు పరిమితమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా బీజేపీకి 240-260 సీట్ల మధ్యే వస్తాయన్నారు. ఆ పరిస్ధితుల్లో మిత్రపక్షాలు 35 నుంచి 45 సీట్ల మద్దతు ఇస్తేనే కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటవుతుందన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ మార్కు సీట్లు 272.

Click it and Unblock the Notifications