ఈ ప్రశాంత్ కిశోర్ ఉన్నాడే.. మన పవన్ ను చాలా ఇరకాటంలో పెట్టాడు
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని స్పష్టం చేశారు. తమ పొత్తు- ప్రజలతో మాత్రమే ఉంటుందని తేల్చి పడేశారు. కష్టమైనా, నష్టమైనా ఒంటరిగానే వెళ్తామని, ప్రజలు తమను ఆదరిస్తామనే నమ్మకం ఉందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో జన్ సురాజ్ పార్టీ పొత్తు పెట్టుకోబోతోందంటూ వచ్చిన వార్తలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. అవి ఒట్టి ఊహాగానాలేనని తోసిపుచ్చారు. అధికారంలోకి రావడం, అనంతరం బీహార్‌ను దోచుకోవడానికి అన్ని ప్రధాన పార్టీలు పోరాటం చేస్తోన్నాయని, అందుకోసమే ఎగబడి పొత్తు పెట్టుకుంటోన్నాయని ఆయన విమర్శించారు. ఇప్పుడు జరిగేది సీట్ల కోసం చేసే పోరాటం కాదని వ్యాఖ్యానించారు.

ఎక్కువ సీట్లు గెలుచుకుని, అధికారంలోకి వచ్చి బీహార్‌ను మరింత దోచుకోవడానికి ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు కుమ్మక్కు అవుతున్నాయని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. లోక్ జనశక్తి సహా ఏ ఒక్క పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదని అన్నారు. వీటన్నింటికీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తోన్నారని, వాళ్లే తమకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. తాను నిర్వహించిన పాదయాత్ర, ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలల్లో ఈ విషయం స్పష్టమైందని అన్నారు.
నిజానికి- లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కి రావట్లేదు. ఈ నేపథ్యంలో జన సూరజ, ఎల్‌జేపీ (ఆర్వీ) మధ్య పొత్తు కుదురుతుందన్న ఊహాగానాలు తలెత్తాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎల్జేపీకి అయిదుకు అయిదూ గెలుచుకుంది. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లను ఆశిస్తోందా పార్టీ. బీజేపీ 25 సీట్లుమాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications