లవ్ బ్రేకప్ అయితే ఇన్సూరెన్స్?

ఇద్దరూ విడిపోతే ఎవరిచేత అయితే మోసపోయారో.. ఆ మోసపోయినవారికి మొత్తం నగదు దక్కేలా ఒప్పందం.

సాధారణంగా మనం బీమా చేయించుకుంటాం. ఎందుకంటే మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని. అయితే కొన్నిసార్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తాం.. మనకెందుకులే అని. బీమా చేయడానికి చాలామంది వెనకాడుతుంటారు. మంచి మార్గంలో మనం పెట్టే పెట్టుబడి తర్వాత తరానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బీమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటో తెలుసుకుందాం..

మోసపోయిన వ్యక్తికి రూ.25వేలు

మోసపోయిన వ్యక్తికి రూ.25వేలు

ఎంతోమంది ప్రేమించుకుంటుంటారు.. విడిపోతుంటుంటారు. కానీ ఇద్దరూ కలిసి వివాహం చేసుకునే సందర్భాలు మాత్రం అరుదుగా ఉంటాయి. నాలుగు రోజలుకే బ్రేకప్ అయ్యే సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఒక జంట బ్రేకప్ చెప్పుకున్నందుకు నష్టపోయిన వ్యక్తికి రూ.25వేలు అందాయి. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్టు షేర్ చేసిన ప్రతీక్ ఆర్యన్

ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. అతను షేర్ చేసిన పోస్టు ప్రకారం.. ఒక వ్యక్తి తన ప్రియురాలితో రెండు సంవత్సరాలు స్నేహంగా ఉన్నారు. స్నేహం ప్రారంభమయ్యే సమయంలో ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ (HBF)అనే జాయింట్ అకౌంట్ ను తెరిచారు.

అందులో నెలకు రూ.500 చొప్పున జమచేసేవారు. ఒప్పందం ప్రకారం ఎవరు మోసపోయినా, ఆ మోసపోయినవారికి మొత్తం డబ్బులు దక్కాలి. అబ్బాయి విడిపోతే అమ్మాయికి దక్కాలి.. అమ్మాయి విడిపోతే అబ్బాయికి దక్కాలి. ఆ విధంగా ఒప్పందం కుదిరింది. ఇద్దరూ రెండు సంవత్సరాలపాటు నెలకు రూ.500 చొప్పున డిపాజిట్ చేయడంతో ఆ ఖాతాలో రూ.25వేలు జమయ్యాయి.

బ్రేకప్ అయినందుకు..

బ్రేకప్ అయినందుకు..

ఇటీవలే వీరి ప్రేమ బ్రేకప్ అయ్యింది. ప్రియురాలు మోసం చేసిందని పేర్కొంటూ ప్రియుడు అకౌంట్ లోని రూ.25వేలు తీసుకున్నట్లు ప్రతీక్ తెలిపాడు. అంటే రూ.12,500 ఒకరు చెల్లిస్తారు.. మరొకరు చెల్లించినది మోసపోయినవారికి దక్కింది. ప్రతీక్ ఆర్యన్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో హార్ట్ బ్రేకప్ ఇన్సూరెన్స్ ఫండ్ కంపెనీకి తాను సీఈవోనని పోస్ట్ చేశారు.

హార్ట్ బ్రేక్ లాంటి ఆలోచన తమ రిలేషన్ షిప్ లో అబ్బాయిలకు మంచి బిజినెస్ ఫండ్ గా మారుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+