వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే డిప్రెషన్‌లోకి 'ఆనంది'? పక్కింటి వ్యక్తి చెప్పిన మరో షాకింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య విషయమై తాజాగా మరో కోణం వెలుగు చూసింది. ఆమె ఆత్మహత్య పైన ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్రత్యూష ప్రియుడు రాహుల్‌ రాజ్ సింగ్ వ‌ల్ల ఆమె సమస్యలు ఎదుర్కొంద‌ని తెలుస్తోంది.

రాహుల్‌కు ఈ మధ్యే వేరొక యువతితో నిశ్చితార్ధం జరగడం ప్రత్యూషను డిప్రెషన్‌లోకి నెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముక్కు, కంటి వద్ద గాయం ఉండడంతో ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య అని ప్రత్యూష బంధువులు, స్నేహితులు అనుమానిస్తున్నారు.

ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహుల్‌కి ఎలాంటి సంబంధం లేదని, తనకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మొదట వాదనలు వినిపించాయి. ప్రత్యూష బెనర్జీ ఐదు రోజుల క్రితం ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Pratyusha Banerjee suicide case: Neighbour makes a shocking revelation!

పక్క అపార్టుమెంట్ వ్యక్తి చెప్పిన షాకింగ్!

ప్రత్యూష, రాహుల్ రాజ్ సింగ్ ఉండే అపార్టుమెంటు పక్కన ఉండే అర్జున్ సచ్‌దేవ్ తాజాగా మరో విషయం వెల్లడించారు. ప్రేమ వైఫల్యం కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండి ఉంటుందని ఎక్కువగా భావిస్తున్నారు.

తాజాగా, అర్జున్ సచ్‌దేవ్ ఆ రోజు ఏం జరిగిందనే విషయం వెల్లడించారు. తాను బయటకు వెళ్లే సమయంలో ప్రత్యూష అప్‌సెట్‌గా లేదని రాహుల్ రాజ్ సింగ్ చెప్పాడు. అయితే, అర్జున్ సచ్‌దేవ్ వ్యాఖ్యలు అందుకు భిన్నంగా కనిపించాయని తెలుస్తోంది.

అర్జున్ సచ్‌దేవ్ మాట్లాడుతూ... పన్నెండున్నర గంటల సమయంలో తాను తన ఇంటి నుంచి బయటకు వచ్చానని, లిఫ్ట్ కోసం నిరీక్షిస్తున్నానని, ఆ సమయంలో ప్రత్యూష గట్టిగా ఏడవడం, అరవడం తాను చూశానని చెప్పాడు. ఆమె గట్టిగా మాట్లాడటాన్ని ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా గుర్తించానని చెప్పాడు.

అప్పుడు ఆమె తలుపును తట్టి, ఏం జరిగిందో అడగాలనుకున్నానని, కానీ అంతలోనే లిఫ్ట్ వచ్చిందని, తనకు అర్జంట్ పని ఉండటంతో తాను వెళ్లిపోయానని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ తాను తలుపు తట్టి పిలిచి అడుగుదామన్నా ఆమెతో తనకు అంతగా పరిచయం లేదని, తాను కచ్చితంగా తలుపు తట్టకపోవడానికి అది కూడా ఓ కారణమని చెప్పారు.

English summary
Pratyusha Banerjee suicide case: Neighbour makes a shocking revelation!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X