'ఆనంది' మృతి: వెలుగు చూస్తున్న షాకింగ్ కోణాలు

ముంబై: చిన్నారి పెళ్లి కూతురు ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు గోరేగావ్‌లోని ఆమె అపార్టుమెంటులో రెండో సారి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి.

ఆమె నివాసం పూర్తిగా చిందరవందరగా ఉంది. ఆ నివాసాన్ని ఆమె తన ప్రియుడు రాహుల్ సింగ్‌తో పంచుకుంటోంది. అందులో దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. మద్యం సీసాలు ఉన్నాయి. సిగరెట్ పీకలు కూడా ఉన్నాయి. సగం తిన్న స్నాక్స్ ప్యాకెట్లు కనిపించాయి.

దర్యాప్తు అధికారులు ఎలా ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ప్రత్యూష ఉరి వేసుకున్న ఫ్యాన్ ప్రధానద్వారానికి సమీపంలో ఉంది. రెండు ఫ్యాన్ రెక్కలు ఏ మాత్రం వంగిపోలేదు. దీన్నబట్టి దుపట్టాను ఫ్యాన్ మధ్యలో కట్టి, దానికి ఉరివేసుకున్నట్లు భావిస్తున్నారు.

Pratyusha Banerjee suicide: Cops shocked to find actress’ house in complete mess

ఆమె ఉరి వేసుకోవడాన్ని మొదటి చూసిన వ్యక్తి రాహుల్. ఆమెను అతనే కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత అతను పోలీసులకు, అంకుల్‌కు సమాచారం ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. డబ్బులు లేకపోవడంతో ప్రత్యూష కృంగిపోయిందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ సింగ్ అంటున్నారు.

పైగా ఆమె తల్లిదండ్రులు ఆమె పేరుతో రూ.50 లక్షల అప్పు కూడా తీసుకున్నారని, దాంతో అప్పిచ్చినవారు ఆమెపై ఒత్తిడి తెచ్చారని ఆయన అంటున్నారు.

మాజీ ప్రేయసితో చీటింగ్

అయితే, ప్రత్యూష మిత్రులు చెబుతున్న విషయాలు మరింత దిగ్భ్రాంతిని కలిగించే విధంగా ఉన్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రత్యూషను మోసగించడానికి రాహుల్ తన మాజీ ప్రేయసిని ఉపయోగించాడని ఆరోపిస్తున్నారు.

రాహుల్ లేని సమయం చూసి మాజీ ప్రేయసి ప్రత్యూషను పలుమార్లు కొట్టిందని, ఈ విషయాన్ని చెప్తే రాహుల్ పట్టించుకోలేదని అంటున్నారు.ప్రత్యూషను రాహుల్ అందరి ముందు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Pratyusha Banerjee suicide: Cops shocked to find actress’ house in complete mess

రాహుల్‌ను పోలీసులు శనివారంనాడు ప్రశ్నించారు. ప్రత్యూష ఆదాయం, వారి పెట్టుబడులు, వారి ఖర్చులు, వారికి గతంలో సంబంధాలు, దాడికి సంబందించిన ఆరోపణలపై పోలీసులు ఆయనను ప్రశ్నించారు. అయితే, తమ మధ్య ఎప్పుడు కూడా తీవ్రమైన గొడవలు జరగలేదని, తాము సంతోషంగా ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని రాహుల్ ప్రత్యూష అటాప్సీ సమయంలో చెప్పాడు.

ఆమె ఎందుకు అలా చేసుకుందో తెలియదని, తన కెరీర్ గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతండేదని, పలుమార్లు తాను ఆమెకు సర్దిచెప్పానని, శాంతపరిచానని, కానీ ఈసారి విఫలమయ్యానని అన్నాడు.

పోలీసుల పేరుతో..

ఇదిలావుంటే, పోలీసులమని చెప్పుకుని వచ్చి ఎనిమిది మంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ప్రత్యూష కొద్ది నెలల క్రితం ఆరోపించింది. బర్త్‌డే పార్టీకి సంబంధించిన బకాయిలను తీర్చడంలో ఆమె, ఆమె ప్రియుడు విఫలమయ్యారని కూడా గతంలో వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+