ప్రియుడికి ఊరట: ప్రత్యూషను కొట్టాను.. రాహుల్ మాజీ ప్రేయసి షాకింగ్

ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ఊరట లభించింది. ఏప్రిల్ 18వ తేదీ వరకు అతనిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అతను కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. 7వ తేదీన హైకోర్టు తిరస్కరించింది. తాజాగా అతనికి ఊరట లభించింది.

మరోవైపు, రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రియురాలు ఒకరు తాజాగా షాకింగ్ విషయం చెప్పింది. తాను ప్రత్యూషను ఓసారి కొట్టినట్లు ఆ మాజీ ప్రియురాలు చెప్పింది. రాహుల్ రాజ్ మాజీ ప్రియురాలి పేరు సలోని శర్మ.

అయితే, అంతకుముందు రాహుల్ రాజ్ సింగ్, ప్రత్యూషలను తనను కొట్టారని చెప్పింది. అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని చెప్పింది.

Pratyusha Banerjee suicide: No arrest for Rahul Raj Singh till April 18

ఫిబ్రవరి పదకొండో తేదీన రాహుల్ రాజ్ అక్కడ ఉన్నాడని తెలుసుకుని, తాను అపార్టుమెంటుకు వెళ్లానని చెప్పింది. నేను రాహుల్‌కు ఇచ్చిన డబ్బును ఆయన ప్రత్యూషకు ఇచ్చాడని, తిరిగి డబ్బు ఇవ్వాలని అంటే రాహుల్ వినలేదని, దాంతో తనకు కోపం వచ్చి డబ్బుని అడిగేందుకు అప్పుడు అక్కడికి వెళ్లానని చెప్పింది.

తనను చూడగానే రాహుల్, ప్రత్యూషలు దాడి చేశారని చెప్పింది. ఫ్లాట్ బయటకు తనను నెట్టేశారని, కోపంతో తాను ప్రత్యూషను కొట్టానని చెప్పింది. ఆపై తాను పోలీసు కేసు పెట్టానని, వారిద్దరూ వచ్చి తనను బతిమాలుకున్నారని, పోలీసులు కూడా ప్రజల దృష్టిలో పడాల్సి వస్తుందని చెప్పడంతో కేసు ఉపసంహరించుకున్నానని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+