'ప్రత్యూష' విషయం ప్రియుడికి ముందే తెలుసు, లాయర్ అరెస్ట్!

ముంబై: ఇరవై రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ గర్భవతి అనే విషయం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు తెలుసు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది.

అంతకుముందు విచారణలో ఆ విషయం తెలియదని చెప్పిన రాహుల్ రాజ్.. తాజాగా మాత్రం గర్భవతి అనే విషయం తెలుసునని చెప్పాడని తెలుస్తోంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన ప్రత్యూష, అబార్షన్ చేయించుకున్న విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pratyusha Banerjee suicide: Rahul Raj Singh tells police he knew about actress' pregnancy

తనతో రాహుల్ సంబంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించడంతో, దీంతో ప్రత్యూష అబార్షన్ చేయించుకుందా? ఈ క్రమంలో ఆమె తనకు ఇష్టం లేకుండానే అబార్షన్ చేయించుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉందని రాహుల్ తరఫున వకాల్తా పుచ్చుకుని ఆ తర్వాత విరమించుకున్న లాయర్ నీరజ్ చెప్పాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రత్యూష కేసులో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తరఫున వాదిస్తున్న లాయర్ చీటింగ్ కేసులో అరెస్టైనట్లుగా తెలుస్తోంది. అతనిని ఆజాద్ మైదాన్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. రాహుల్ తరఫు లాయర్‌తో పాటు మరో ఇద్దరు అడ్వోకేట్లను అరెస్టు చేశారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+