బుల్లితెర 'ఆనంది' గర్భవతి?: ఆసుపత్రిపాలైన రాహుల్

ముంబై: ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష బెనర్జీ రెండు నెలల గర్భవతి కావొచ్చునని వైద్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో ఆనందిగా ప్రత్యూష నటించింది. ఆమె రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

మీడియాలో వస్తున్న వార్తల మేరకు... ఆమె గర్భవతి కావొచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. వారు శాంపిల్స్‌ను జేజే ఆసుపత్రికి పరీక్షల కోసం పంపించారు. కాగా, మృతికి సంబంధించి ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌ను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. అతనిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, ప్రత్యూష బెనర్జీ అంత్యక్రియలు బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య శనివారం ముగిసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కొత్త పెళ్లికూతురుగా అలంకరించారు. పట్టుచీర కట్టి, అదే అలంకరణ మధ్య ఆమెను స్మశానవాటికకు తరలించారు. ముంబైలోని ఓషివారా క్రిమెటోరియంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి.

Pratyusha death: Boyfriend hospitalised

మరోవైపు, ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రి పాలైనట్లుగా తెలుస్తోంది. అతను ఆదివారం ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని రాహుల్ తరఫు లాయర్ మీడియాకు తెలిపారు. అతను చెస్ట్ పెయిన్, డిప్రెషన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు.

ప్రత్యూష బెనర్జీ మరణం వెనుక రాహుల్ హస్తం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని ముంబై పోలీసులు వెల్లడించారు. రాహుల్‌ను దాదాపు 14 గంటల పాటు విచారించిన అనంతరం... ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+