ఆసుపత్రి నుంచి దూకేస్తా!: ప్రియుడు, ప్రత్యూష పేరెంట్స్ ట్విస్ట్
ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రి భవనం నుంచి దూకేస్తానని హెచ్చరించాడు.
ప్రత్యూష ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ రాజ్ సింగ్... ప్రత్యూషను ఆసుపత్రిలో అడ్మిడ్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఒత్తిడి తదితరాల కారణంతో ఓ ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజాగా, ఓ విషయం వెలుగు చూసింది. శుక్రవారం నాడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రిలోని తన గదిలోని వాష్ రూంలో లోపలకి లాక్ చేసుకున్నాడు. అంతేకాదు, తాను భవనం పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. అతను ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒత్తిడిలో అతను దూకేస్తానని చెప్పాడని తెలుస్తోంది.

మరోవైపు, ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. తమ కూతురు ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని, రాహుల్ రాజ్ సింగ్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాహుల్ రాజ్ సింగ్ విచారణకు సహకరించకుండా ఉండేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని, ఇందుకు సంబంధించి రాహుల్, ఆసుపత్రి మేనేజ్‌మెంట్ మధ్య కుట్రపూరిత ఒప్పందం ఉన్నట్లుగా ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనికి ఆసుపత్రి యాజమాన్యం షెల్టర్ ఇస్తోందని ఆరోపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications