'ప్రవీణ్ తోగాడియాను అడ్డుకుంటాం, ప్రసంగాలకు అనుమతివ్వం'
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాను కర్ణాటకలో సభలు సమావేశాలలో పాల్గొనడానికి వస్తే అడుగుపెట్టనివ్వమని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి కే జే జార్జ్ స్పష్టం చేశారు. ప్రవీణ్ తొగాడియా బహిరంగ సమావేశాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా పుత్తూరు తదితర ప్రాంతాలలో జరిగిన విరాట్ హిందూ సమాజోత్సవ బహిరంగ సభలలో ప్రవీణ్ తొగాడియా ప్రసంగించారని గుర్తు చేశారు. అనంతరంరాష్ట్రంలో అనేకచోట్ల మతఘర్షణలు జరిగాయని విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అనేక నగరాలు, పట్టణాలలో విరాట్ హిందూ సమాజోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రవీణ్ తొగాడియా మాట్టాడటానికి ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రవీణ్ తొగాడియా మాట్లాడిన మాటలు, వీడియో క్లిప్పింగ్‌లు సైతం ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు.
కర్ణాటకలోని అనేక చోట్ల విరాట్ హిందు సమాజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కాని ప్రవీణ్ తొగాడియా అడుగు పెట్టకుండా ఆయా జిల్లాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తొగాడియాను రాష్ట్రంలో సంచరించి సభలు, సమావేశాలలో పాల్గోనడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టులో అర్జీ సమర్పించారు. తొగాడియా సభలు సమావేశాలలో పాల్గోనకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపణలు ఉన్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications