అక్కడ గర్భవతి అయిన తర్వాతే ఆమెకు అతడు భర్త అవుతాడు!

చెన్నై: పలు గిరిజన జాతులు, ఆదివాసులు తమకు కలిగిన ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మనకు కొంత వింతగా అనిపించినా వారు ఎంతో కాలంగా కొనసాగిస్తుండటం గమానర్హం. తాజాగా తమిళనాడుకు చెందిన గిరిజన ఆచారం ఒకటి వెలుగుచూసింది. అదేమంట.. మొదట పెళ్లాడినా.. గర్భవతి అయిన తర్వాత అందుకు కారణమైన అతను ఆమెకు భర్త అవుతాడు.

వివరాల్లోకి వెళితే.. నీలగిరి అడవుల్లో ఉండే టోడ గిరిజన తెగలో పెళ్లివేడుక సాధారణంగా నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత వధువు, వరుడితో గడుపుతుంది. అనంతరం వధువు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది.

 Pregnancy first, marriage later

ఆ సమయంలో పెళ్లి కూతురు కచ్ఛితంగా నెల తప్పాల్సిందే. గర్భం ధరించకపోతే ఆ వివాహం చెల్లదు. నెల తప్పితే ఏడో నెలకు భర్త అడవికి వెళ్ళి పవిత్రంగా భావించే చెట్టు కాండంతో విల్లు, బాణం తయారు చేసి భార్యకు ఇస్తారు. ఆ వస్తువులు భార్యకు నచ్చి తీసుకొంటే అతడిని భర్తగా అంగీకరించినట్లు.

ఈ కార్యక్రమం అనంతరం విల్లు, బాణం వేడుకలు భారీ ఎత్తున జరుపుతారు సంప్రదాయ నృత్యాలు పాటలతో ఘనంగా సంబరాలు చేసుకొంటారు. ఈ వేడుకలు అనంతరం ఇరువురు పెద్దల ఆశీర్వాదంతో అప్పటి నుంచి భార్యాభర్తల్లా జీవితాంతం కలిసి ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+