నిద్రలేని రాత్రులు, బుద్ధి గడ్డితింది: రాంపాల్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రాంపాల్ జైల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు జైలు వర్గాల సమాచారం. లోకల్ కోర్టు ఆదేశాల మేరకు ఆతన్ని పోలీసులు ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
తన 12 ఎకరాల ఆశ్రమం నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు హిస్సార్‌లోని సివిల్ లైన్స్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో బాబా రాంపాల్ అన్ని ప్రశ్నలకు "బుద్ధి గడ్డితింటే ఇలాంటి గతే పడుతుంది. నా బుద్ధి గడ్డితింది.." అంటూ గదిలో పచార్లు చేస్తూన్నాడని పోలీసులు పేర్కొన్నారు. నిద్రపోవడం లేదని, పోయినా ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
బాబా రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో... ఆయన స్వగ్రామం సోనేపట్‌లోని ధనానలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రితో విభేదాలు రావడంతో రాంపాల్ రోహ్‌తక్ వచ్చేశాడు. తన పూర్వీకుల ఇంటిని కూడా రూ.4.60 లక్షలకు పొరుగువారికి రాంపాల్ ఆమ్మేశాడని వారు చెప్పారు. తనకు రక్షణగా రాంపాల్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు సైన్యానికి బీహార్, ఛత్తీస్‌గఢ్, నేపాల్‌కు చెందిన మావోయిస్టులు శిక్షణ ఇచ్చి ఉంటారని ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి.
బీహార్‌లోని చంపారణ్ జిల్లాకు చెందిన మావోయిస్టు మహావీర్ సక్లానీ, బాబా రాంపాల్ ఆశ్రమంలో వైద్యునిగా అవతారమెత్తి బాబా అనుచరులకు మందులు సూచించేవాడు. సక్లానీని గత ఆగస్టు 19న బీహార్ ఎస్‌టీఎఫ్ బృందాలు అరెస్టు చేయడంతో రాంపాల్‌కు మావోయిస్టులతో సంబంధాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

రాంపాల్ ప్రైవేట్ సైన్యానికి మావోయిస్టుల ట్రైనింగ్..?
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రాంపాల్ జైల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు జైలు వర్గాల సమాచారం. లోకల్ కోర్టు ఆదేశాల మేరకు ఆతన్ని పోలీసులు ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

రాంపాల్ ప్రైవేట్ సైన్యానికి మావోయిస్టుల ట్రైనింగ్..?
హత్య కేసులో అరెస్టైన వివాదాస్పద బాబా రాంపాల్‌కు చెందిన సత్ లోక్ ఆశ్రమంలో హర్యానా పోలీసులు శుక్రవారం పెద్దమొత్తంలో ఆయుధ సామాగ్రిని గుర్తించారు. ఇందులో వివిధ రకాల తుపాకులు, తూటాలు, పెట్రోలు బాంబులు, యాసిడ్ సిరంజీలు, మిర్చి గ్రెనేడ్ ఉన్నాయి. ఆయుధ సామాగ్రి చాలా వరకు రెండు రహస్య గదుల్లో దాచి ఉంచారు.

రాంపాల్ ప్రైవేట్ సైన్యానికి మావోయిస్టుల ట్రైనింగ్..?
కంచుకోటలా ఉన్న ఆశ్రమం మధ్యలో రాంపాల్ కూర్చునే నిర్మాణం కింద ఆయుధ సామాగ్రిని దాచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. తనిఖీల్లో రాంపాల్ గదిని ఆనుకొని ఉన్న ఓ గదిలో గర్భధారణ పరీక్ష పట్టీ లభించింది. తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిలో మహిళ అపస్మారక స్థితిలో కనిపించారు.

రాంపాల్ ప్రైవేట్ సైన్యానికి మావోయిస్టుల ట్రైనింగ్..?
ఈ ఆయుధాలన్నింటినీ రహస్య గదుల్లోని అల్మరాల్లోనూ, బ్యాగుల్లోనూ దాచినట్లుగా తెలిపారు. ఈ ఆశ్రమంలో రాంపాల్ కూర్చునేందుకు ఓ ఎత్తయిన వేదిక ఉందని, ఎవరూ అనుమానించడానికి వీలు లేకుండా దానిలోపే ఈ ఆయుధాలను దాచారని పోలీసులు తెలిపారు.

రాంపాల్ ప్రైవేట్ సైన్యానికి మావోయిస్టుల ట్రైనింగ్..?
పాయింట్ 32 రివాల్వర్లు, 19 ఎయిర్‌గన్లు, పాయింట్ 315 బోర్ రైఫిళ్ళు, 28 తూటాలు, వివిధ పరిమాణం గల తూటాలను భారీ సంఖ్యలోనే స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఆయుధాలు తయారు చేయడంలో ఆశ్రమంలోని వాలంటీర్లకు సక్లానీ శిక్షణ ఇచ్చే వాడని పోలీసులు భావిస్తున్నారు. రాంపాల్ బాబా ఆశ్రమం నుంచి పోలీసులు శనివారం బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే బాబా రాంపాల్ అనుచరులైన 31 మందికి పది రోజుల రిమాండ్ విధించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications