రెండేళ్ల కిందట ప్రేమ వివాహం..మూడో నెల గర్భం: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!

బెంగళూరు: ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కర్ణాటకలో కలకలాన్ని రేపింది. ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. ఏడాది కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో వారిని ఎదిరించి..మరీ ఆమె తన స్నేహితుడిని పెళ్లాడారు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడటానికి పోలీసు అధికారుల వేధింపులే కారణమంటూ ఆమె భర్త ఆరోపించడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు.

మృతురాలి పేరు సీమా శివనగౌడర. వయస్సు 24 సంవత్సరాలు. కొంతకాలంగా గదగ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో సీమా ప్రేమ వివాహం చేసుకున్నారు. గదగ్ జిల్లా న్యాయస్థానంలో పని చేస్తోన్న యువకుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. శుక్రవారం తెల్లవారు జామున భర్త వాకింగ్ కోసం బయటికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పటికి సీమా సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు.

Pregnant police constable commits suicide at her residence in Gadag in Karnataka

ఫ్యానుకు నిర్జీవంగా వేలాడుతున్న సీమను చూసిన వెంటనే ఆమె భర్త గదగ్ బెటగెరె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసు అధికారుల వేధింపులే కారణమని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బెటగెరె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీమా భర్త చేస్తోన్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+