సెక్స్ కోసం బలవంతం.. 5 నెలల గర్భిణీ అని చూడకుండా.. చివరికీ ఏమైందంటే...

కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా చూపించడం లేదు. గర్భవతులను కూడా వదలడం లేదు. అయితే తమిళనాడులో ఓ గర్భిణిని సెక్స్ కోసం వేధించాడు. కట్టుకున్న భర్తే హరాస్ చేయడంతో ఆ ఇల్లాలు బరించలేకపోయింది. విసుగెత్తి.. చివరికీ కఠిన నిర్ణయమే తీసుకుంది. తన భర్తనే మట్టుబెట్టాలని అనుకొంది. సమయం కోసం వేచిచూసింది.

 8 నెలల క్రితం రెండో వివాహం

8 నెలల క్రితం రెండో వివాహం

తమిళనాడులోని పెరియమొలపలయమ్‌కి చెందిన మైథిలీకి కలియన్నామ్ తొట్టమ్‌‌కు చెందిన కుమార్‌తో పెళ్లయ్యింది. తొట్టమ్ ఆందియుర్‌కు సమీపంలో గల గ్రామం.. వీరికి 8 నెలల క్రితం వివాహామైంది. అయితే కుమార్‌కు మైథిలితో రెండో వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే మైథిలీ గర్భవతి అయ్యింది. కానీ కుమార్ ఆమెను సెక్స్ కోసం వేధించడం స్టార్ట్ చేశాడు. దీంతో మైథిలీ తట్టుకోలేకపోయింది. కట్టుకున్న భర్తే హరాస్ చేయడంతో గట్టి నిర్ణయమే తీసుకుంది.

సెక్స్ కోసం ఒత్తిడి

సెక్స్ కోసం ఒత్తిడి

సెక్స్ కోసం కుమార్ వేధించడం ప్రారంభించారు. అసలే గర్భవతి అయినందున.. ఆమె ఓర్పుకుంది. చివరికీ ఆమె సహనం నశించిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. చివరికీ అతనిని చంపేయాలని నిర్ణయం తీసుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. గతనెల 28వ తేదీన ఆహారంలో పురుగుల మందు కలిపింది. జనవరి 31వ తేదీన అతనిని అనారోగ్యంతో ఆందియూర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడు. ఈ నెల 15వ తేదీన కుమార్ చనిపోయాడు.

15 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ

15 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ

నందకుమార్ మృతి గురించి వైద్యులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. తన భర్త వేధింపులకు గురిచేశాడని.. అందుకే హతమార్చానని మైథిలీ తెలిపింది. ఈ మేరకు వివరాలను ఎస్సై రవి తెలియజేశారు. మైథిలీని అదుపులోకి తీసుకున్నామని.. ఆమెకు మెజిస్ట్రేట్ 15 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించారని పేర్కొన్నారు.

భర్తే వేధించడంతో..

భర్తే వేధించడంతో..

కట్టుకున్న భార్యను లైంగిక వేధించగా.. భార్య తట్టుకోలేకపోయింది. భర్త అంటే అర్థం చేసుకోవాలి కానీ.. వేధించడం సరికాదు అని అంటున్నారు మేధావులు. భర్తే వికృతంగా ప్రవర్తిస్తే తన బాధను ఎవరికీ చెప్పుకుంటుందని చెబుతున్నారు. భర్త అంటే భార్య అన్నీ.. సాధక బాధకాలు చెప్పుకుంటుందని తెలిపారు. కానీ నందకుమార్ మాత్రం హరాస్ చేయడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే మైథిలీ కఠిన నిర్ణయం తీసుకుందని వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+