పెళ్లాడమంటే.. ప్రియురాలిని రైలు కింద తోసేశాడు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమందని ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు గర్భవతి అయిన తన ప్రియురాలును కర్కశంగా రైలు కింద తోసేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.
మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే పోలీసులు, అధికారులు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. కతిహార్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం మాల్దా నుంచి శంసీ స్టేషన్‌కు వెళ్తొంది. ఈ సమయంలో అక్కడున్నవారికి ఓ మహిళ ఆర్తనాదం వినిపించింది. దీంతో రైల్వే పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి చూడగా ఓ మహిళ రైల్వే పట్టాలపై రక్తపు మడుగులోపడి ఉంది.
వెంటనే ఆమెను దగ్గరున్న మాల్దా మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ ఘటనలో బాధితురాలు కుడి చేయి కోల్పోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి కుటుంబసభ్యులు నిందితుడైన అహిమ్ మండల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయించారు.

తమ కుమార్తె అహిమ్‌తో ప్రేమలో ఉందని, ప్రస్తుతం ఆమె గర్భవతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వారి ప్రేమ విషయం తెలిసి పెళ్లి చేసుకోమని అడిగితే అహిమ్ మొదట తిరస్కరించాడని, డిసెంబరు 16న తాము అతనిపై కేసు పెట్టడంతో పెళ్లికి సమ్మతించాడని అన్నారు. అయితే, తమ కుమార్తెను చంపాలనే ఉద్దేశం అతడికి ఉందని ఊంహించలేదని వాపోయారు.
కాగా, మంగళవారం అహిమ్ ఇంటికి వచ్చి తమ కుమార్తెను 'బయటకు వెళ్దాం' రమ్మని పిలిచినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. ఆమెను బయటికి తీసుకెళ్తున్నాడు.. అనుకున్నామే కానీ, ఇలా రైలు కింద తోసేస్తాడనుకోలేదని చెప్పింది. తమ కూతురు మరణానికి కారణమైన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అహిమ్ మరో కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications