గర్భవతి సహా ముగ్గురిపై నుంచి దూసుకెళ్లిన కారు

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న ముగ్గురిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఓ గర్భవతి ఉంది. సోమవారం ఉదయం వెలాచెరిలోని భారతినగర్‌లో ఈ సంఘటన జరిగింది.

మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. వారు 34 ఆర్ముగం, 28 ఏళ్ల ఐశ్వర్య. ఐశ్వర్య గర్భంతో ఉంది. మరో మహిళను గుర్తించాల్సి ఉంది. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో కారుకు అడ్డంగా ఆవు రావడంతో కంగారు పడిన డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.

ఆర్ముగంతో పాటు గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మరణించగా, ఐశ్వర్య ప్రభుత్వ రోయపెట్టా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిఆర్‌హెచ్‌కు పంపించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Pregnant woman, two other platform dwellers fatally run over by car in Chennai

కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం

ఇదిలావుంటే, మధురై కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 52 ఏళ్ల మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదనే ఆవేదనతో సోమవారం నాడు ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.

కోసకులానికి చెందిన రాము అనే మహిళ కిరోసిన్ సీసాతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అక్కడ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఒంటికి నిప్పంటించుకునే సమయంలో పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత తల్లకులం పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+