నిండు గర్బిణిపై సైనికుల గ్యాంగ్ రేప్!

గౌహతి: విచారణ పేరుతో ఇంటిలో చొరబడిన ఇద్దరు సైనికులు నిండు గర్బిణి మీద గ్యాంగ్ రేప్ చేసిన దారుణంగా సంఘటన అసోం రాష్ట్రంలో జరిగింది. కోక్రాజర్ జిల్లాలోని గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈనెల 9వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోని ఒక ఇంటికి పోలీసు అధికారులు, సైనికులు వెళ్లారు. ఇంటిలో 8 నెలల నిండు గర్బిణి ఉంది. నీ భర్త ఎక్కడికి వెళ్లాడని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆయన ఇంటిలో లేడని ఆమె చెప్పింది.

గర్బిణి భర్త నిషేధిత నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడా ల్యాండ్ (ఎన్ డీఎఫ్ బీ) తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. తరువాత పోలీసు అధికారులు, సైనికులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

Pregnant women gang raped by Army men in Assam on Sunday night

సోమవారం వేకువ జామున 2 గంటల సమయంలో ఇద్దరు సైనికులు మళ్లీ ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇద్దరు సైనికులు ఇంటి తలుపుకొట్టారు. మహిళ తలుపు తియ్యడంతో నీ భర్త ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. ఆమె తెలియదని సమాచారం ఇచ్చింది.

వెంటనే ఆమెను లోపలికి నెట్టి ఇద్దరు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయారు. మరుసటి రోజు బంధువుల సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోయింగూరి బేస్ క్యాంప్ (ఆర్మీ క్యాంప్) లో ఉన్నఇద్దరు గుర్తు తెలియని సైనికుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆర్ ఎన్ బ్రహ్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్మీ అధికారులు మాత్రం బాధితురాలిపై సైనికులు రేప్ చెయ్యలేదని అంటున్నారు.

నిషేధిత తీవ్రవాద సంస్థ ఎన్ డీఎఫ్ బీ ప్రోత్సాహంతో సైనికులకు మచ్చ తీసుకురావడానికి ఆమె దగ్గర కేసు పెట్టించారని ఆర్మీ అధికారులు ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం జిల్లా డిప్యూటి కమిషనర్ ఆద్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+