సినిమా చూసి సంతోషంగా వస్తుంటే భర్త ముందే గర్భిణి కిడ్నాప్, గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి టార్చర్ !

చెన్నై/కడలూర్: భర్తతో కలిస సంతోషంగా సినిమా చూసి ఇంటికి వెలుతున్న గర్భిణిని కిడ్నాప్ చేసిన కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను కట్టేసి అతని కళ్ల ముందే ఐదు నెలల గర్భిణి ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టిన కిరాకతకులు ఆమెపై లైంగిక దాడి చేసి వీడియోలు తీశారు. విషయం బయటకు చెబితే అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, అందర్నీ చంపేస్తామని బెదిరించిన కామాంధులు ఆమెను ఇంటి దగ్గర వదిలిపరారైన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో జరిగింది.

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

తమిళనాడులోని కడలూర్ జిల్లాలోని పుదుప్పాలైయమ్ లో 21 ఏళ్ల మహిళ భర్తతో కలిసి ��ివాసం ఉంటున్నది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. కొన్ని రోజుల నుంచి తాను సినిమా చూడాలని, పిలుచుకుని వెళ్లాలని ఆమె భర్తకు చెప్పింది. కడుపుతో ఉన్న భార్యను సినిమాకు తీసుకెళ్లాలని ఆమె భర్త నిర్ణయించాడు.

సంతోషంగా సినిమా చూసి వస్తుంటే !

సంతోషంగా సినిమా చూసి వస్తుంటే !

ఇద్దరు పిల్లలను కుటుంబ సభ్యుల దగ్గర వదిలిపెట్టిన దంపతులు కడలూర్ లోని ఓ థియేటర్ కు వెళ్లారు. ద���పతులు ఇద్దరూ సంతోషంగా సినిమా చూసి బైక్ లో ఇంటికి బయలుదేరారు. చాల కాలం నుంచి మహిళ మీద కన్నేసిన ముగ్గురు కామాంధులు ఎలాగైనా ఆమెను అనుభవించాలని పక్కాప్లేన్ వేశారు.

భర్తను కట్టేసి ఎత్తుకెళ్లి !

భర్తను కట్టేసి ఎత్తుకెళ్లి !

దంపతులను కారులో వెంబడించిన కామాంధులు నిర్జనప్రదేశంలో వారిని అడ్డుకున్నారు. తరువాత భర్త మీద ముగ్గురు ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. భర్తను కట్టేసి చితకబాదిన నింద���తులు ఆమెను బలవంతంగా కారులో ఎత్తుకుని కమ్మియమ్ పేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు.

 గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీసి !

గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీసి !

గర్భిణి అని కనికరం లేని కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మహిళపై అత్యాచారం చేసే సమయంలో వీడియోలు తీశారు. రాత్రి మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు విషయం బయటకు చెబితే గ్యాంగ్ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చ���స్తామని, మిమ్మల్ని, మీ పిల్లలను చంపేస్తామని బెదిరించారు.

 కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసి !

కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసి !

మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు తరువాత ఆమెను కారులో తీసుకెళ్లి ఇంటి సమీపంలో వదిలి పరారైనారు. కామంధులు కట్టేసి దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన భర్త చివరికి కట్లు ఊడదీసుకుని ఆమె కోసం గాలించాడు. భార్య ఇంటి దగ్గరకు చేరుకుందని తెలుసుకున్న భర్త అక్కడికి చేరుకుని బోరున విలపించాడు. బాధితురాలు పుదునగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి కామాంధుల కోసం గాలిస్తున్నామని కడలూర్ జిల్లా అడిషనల్ ఎస్పీ శాంతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+