సంచలనాలకు మారుపేరు: ప్రీతి జింతా తీరే వేరు

ముంబై: బాలీవుడ్ నటీమణుల్లో ప్రీతి జింతా తీరే వేరు. ఆమె సంచలనాలకు మారు పేరు. లైంగికంగా వేధిస్తున్నాడని మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త, ఐపియల్ ఫ్రాంచైజీ సహ భాగస్వామి నెస్ వాడియాపై ఫిర్యాదు చేసి ప్రీతి జింతా సంచలనం సృష్టించారు. ఆమె ధైర్యం ప్రదర్సించిన సందర్భాలు, సంచలనం రేపిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

2003లో అండర్ వరల్డ్ మాఫియాపై ప్రీతి జింతా కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. బాలీవుడ్‌లో ఏ హీరో, హీరోయిన్ కూడా మాఫియాకు బెదరకుండా ప్రీతి జింతాలా వ్యవహరించిన సంఘటనలు లేవు.

preity Zinta became well known for her attitude several times in Bollywood.

2005లో తనపై అమార్యపూర్వకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గొంతు చించుకుని వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం చేస్తూ ముంబైకి చెందిన ముంబై పత్రికపై పరువు నష్టం దావా వేశారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌తో తన వైవాహిక జీవితానికి తెరపడడానికి ప్రీతి జింతా కారణమని సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపించారు. దానికి ప్రీతి జింతా బెదరకుండా ధీటుగా స్పందించి ఆమె మానసిక స్థితి బాగా లేదని వ్యాఖ్యానించారు.

2001లో విడుదలైన చోరీ చోరీ చుప్కే చుప్కే చిత్రంలో వేశ్య పాత్ర పోషించడమే కాకుండా సర్రోగసి మదర్ పాత్రలో కూడా నటించి సంచలనం సృష్టించారు. క్యా కహనా చిత్రంలో పెళ్లికాకుండానే తల్లయిన పాత్రను పోషించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన దిల్ సే చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతి జింతా ఆ చిత్ర హీరో షారూక్ ఖాన్‌ను నీవు బ్రహ్మచారివేనా అంటూ ప్రశ్నించి విమర్శలకు గురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+