ప్రీతి జింటా కజిన్ ఆత్మహత్య: సూసైడ్ నోట్స్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా కజిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ రెండు సూసైడ్ నోట్స్ రాశాడు.
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి కజిన్ నితిన్ చౌహాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. షిమ్లాలో నివసిస్తున్న అతను శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను తనను తాను కాల్చుకుని మరణించినట్లు తెలుస్తోంది.
న్యూ సిమ్లాలోని సెక్టార్ 2లో హెచ్‌పి 51 2089 నెంబర్ గల వాహనంలో పిస్టల్‌తో అతను తలకు గురి పెట్టుకుని కాల్చుకుని మరణించాడు. అతను రాసిన రెండు సూసైడ్ నోట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఓ సూసైడ్ నోట్ కారులో ఉండగా, మరో సూసైడ్ నోట్ ఇంట్లో ఉంది. ఈ రెండు సూసైడ్ నోట్స్‌లోనూ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. తన భార్య, తన అత్తగారి కుటుంబ సభ్యులు తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని చెప్పాడు.
తన కుమారుడిని కలుసుకోనివ్వడం లేదని, తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన తన అత్తగారి కుటుంబ సభ్యులపై ఆరోపణ చేశాడు. సూసైడ్ నోట్స్ ఆధారంగా పోలీసులు నితిన్ అత్తారింటి సభ్యులపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications