Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యక్తిగత విషయాలడగటం అంత మంచిది కాదు: ప్రీతి జింటా

ముంబై: బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా ఓ మహిళా జర్నిలిస్ట్‌పై మండిపడింది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ప్రీతి జింటాను ఆ మహిళా జర్నలిస్ట్ కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

అనంతరం ఆమెతో 'మహిళగా ఉండటానికి ప్రయత్నించు... మంచి జర్నలిస్ట్'గా కాదని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రీతి జింటా అసలు తనపై ఎందుకంతలా మండిపడిందో అర్ధంకాక ఆ మహిళా జర్నలిస్ట్ నిశ్చేష్టురాలైంది.

 Preity Zinta slams scribe, says 'asking personal questions is not cool'

ప్రీతి జింటా, టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్‌తో ఏకంగా సహజీవనం చేస్తోందని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బహుశా ఈ వార్తలపై ఆ మహిళా జర్నలిస్ట్ ప్రీతి జింటాను అడిగి ఉండొచ్చు. గతంలో మాజీ ప్రియుడు నెస్ వాడియాతో వివాదం చెలరేగినప్పుడు ప్రీతి చాలా ఒత్తిడికి గురైంది.

ఆ సమయంలో ఈ అందాల భామకు యువరాజ్ సింగ్ ఆపన్నహస్తం అందించాడట. అండగా నిలబడి, ఆత్మస్థైర్యాన్ని నింపాడట. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య బంధం బలపడి, ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. కాగా నెస్ వాడియా తనను వేధించాడని ఆరోపిస్తూ ప్రీతి జింటా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+