మాజీ మంత్రి రామదాస్ మీద పోటీ చేస్తా: బీజేపీ లీడర్ మాజీ ప్రియురాలు చాలెంజ్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ ఏ. రామదాస్ కు ఆయన ప్రియురాలు అని చెప్పుకుంటున్న ఓ మహిళ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో మైసూరు నగరంలోని కే.ఆర్‌.నగర (కృష్ణరాజ నగర) నియోజకవర్గం నుంచి తాను మాజీ మంత్రి మీద పోటీ చేస్తానని ప్రేమ కుమారి తెలిపారు.

2014లో మాజీ మంత్రి రామదాస్ ప్రియురాలిగా ప్రేమ కుమారి వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రేమ కుమారి మాజీ మంత్రి రామదాస్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని పోలీసు కేసు పెట్టారు.

Prema Kumari announced that she will contest for Karnataka assembly elections 2018.

శాసన సభ ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటికే కేఆర్‌. నగర నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మాజీ మంత్రి రామదాస్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు.

ఇటీవలే కేఆర్. నగర నియోజకవర్గంలో చెత్త సమస్యపై మాజీ మంత్రి రామదాస్ నిరాహార దీక్ష చేసి సిద్దరామయ్య ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. శాసన సభ ఎన్నికల కోసం మాజీ మంత్రి రామదాస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ సందర్బంలో తెర మీదకు వచ్చిన ప్రేమ కుమారి మరోసారి మాజీ మంత్రి రామదాస్ కు షాక్‌ ఇచ్చారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి అయినా లేదా స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి కచ్చితంగా నిలబడతానని ప్రేమ కుమారి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+