Maha kumbhmela 2025: అధికారులంతా VIPల వద్ద.. ప్రత్యక్షసాక్షి ఏం చెప్పాడంటే?

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశుృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు లక్షలమంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందినట్లు సమాచారం. మరో 100 మంది భక్తులు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహాకుంభమేళాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.గాయపడ్డ వారిని సహాయక సిబ్బంది అంబులెన్స్ ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

కారణం ఇదే..

మహాకుంభమేళాలో తొక్కిసలాటపై ప్రముఖ మతాధికారి ప్రేమానంద్ పూరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రయాగ్ రాజ్ లోని అధికార యంత్రాంగం భక్తుల భద్రతను గాలికొదిలేసిందని ఆరోపించారు.
"అధికారులు వీఐపీ, ప్రముఖులకు సేవలు చేయడంలో నిమగ్నమయ్యారు.సాధారణ భక్తుల వద్ద పోలీసులు, అధికారులు ఎవరూ లేరు. నేను మహాకుంభమేళాకు వచ్చిన ప్రతి వీఐపీ వ్యక్తిని చూశాను. అందరికీ స్థానిక అధికారులు సపర్యలు చేశారు. అందుకే తొక్కిసలాట జరిగింది" అని ప్రేమానంద్ పూరీ మండిపడ్డారు.

Premanand Puri Criticizes Bureaucratic Negligence in Mahakumbha Mela Stampede

ఆర్మీకి బాధ్యతలు ఇస్తే..

మహాకుంభమేళా పర్యవేక్షణ ఏర్పాట్లను భారత ఆర్మీకి అప్పగిస్తే.. వాళ్లు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసేవారని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేవని ప్రేమానంద్ పూరీ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ బాధ్యతలు ఇండియన్ ఆర్మీకు ఇవ్వాలని అఖాడాలు కూడా కోరుకుంటున్నారని అన్నారు.

జనవరి 29 మౌని అమావాస్య సందర్భంగా లక్షల మంది భక్తులు తెల్లవారుజామునుంచే గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు ఆచరించేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+