ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు: కంభంపాటి హరిబాబుకు ఛాన్స్: దత్తన్న ట్రాన్స్‌ఫర్
న్యూఢిల్లీ: దేశంలో ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. కొంతమందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబుకు కొత్త గవర్నర్ల జాబితాలో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయకు స్థానం చలనం కలిగింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టేసిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఒకరికి గవర్నర్‌గా పంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కేంద్ర కేబినెట్‌లో భారీ ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనే సంకేతాలను పంపించినట్టయింది.
కొత్త గవర్నర్ల జాబితాలో కంభంపాటి హరిబాబు-మిజోరం, తావర్‌చంద్ గెహ్లాట్-కర్ణాటక, మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్-మధ్యప్రదేశ్, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్-హిమాచల్ ప్రదేశ్‌కు నియమించారు. ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్‌గా స్థానచలనం కల్పించారు. మిజోరం గవర్నర్‌గా ఉన్న పీఎస్ శ్రీధరన్ పిళ్లైని గోవాకు బదిలీ చేశారు. త్రిపుర గవర్నర్ రమేష్ భైన్స్‌ను జార్ఖండ్‌కు పంపించారు.

ఈ జాబితాలో ఉన్న తావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం కేంద్రమంత్రి. ఆయన కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. దీన్ని బట్టి చూస్తోంటే- ఒకట్రెండు రోజుల్లో సంభవించబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది. విస్తరణ సందర్భంగా కొన్ని అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టయింది. బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు పంపించడం కూడా ఆసక్తికరంగా మారింది.
కంభంపాటి హరిబాబు విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైజాగ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మను ఓడించిన ఘనతకు కంభంపాటి హరిబాబుకు ఉంది. ఆయనను గవర్నర్‌గా నియమించడం పట్ల ఏపీ బీజేపీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో బండారు దత్తాత్రేయను రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న హర్యానాకు బదిలీ చేయడాన్ని ప్రమోషన్ కల్పించినట్లుగా భావిస్తోన్నారు.
Recommended Video
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications