Droupadi Murmu: ఢిల్లీలో మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్త్రాధారణ సామాన్య పౌరురాలి ఉంటుంది. ఆమె ఎప్పుడు సింప్లిసిటీనే ఇష్టపడతారని చెబుతారు. తాజాగా ద్రౌపది ముర్ము సామాన్య పౌరురాలిలో ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ద్రౌపది ముర్ము పసుపు రంగు చీర ధరించి రైలెక్కారు. ఆమెకు మెట్రో అధికారులు పలు వివరాలను వివరించారు.
ఈ సమయంలో ముర్ము కూర్చున్న మెట్రో కోచ్ చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, అధికారులు ఉన్నారు. రాష్ట్రపతికి అత్యంత సమీపంలోని కోచ్‌లో ఆయన భద్రత కోసం ప్రత్యేక అధికారులు కూడా నల్ల బ్యాగ్‌తో తిరుగుతూ కనిపించారు. రాష్ట్రపతి పర్యటన ప్రజల దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ప్రధాని మోడీ ద్వారకా సెక్టార్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడారు.
ప్రజలు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. అదే రోజు మోడీ పుట్టి రోజు కాబట్టి ప్రజలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.












Click it and Unblock the Notifications