Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parkash Singh Badal: ప్రకాష్ సింగ్ బాదల్ మృతిపై ప్రముఖులు సంతాపం..

పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి ఆకాలిదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్(Parkash Singh Badal) మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. " ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్యమైన రాజకీయ ప్రముఖులలో ఒకరు. ప్రజాసేవలో ఆయన ఆదర్శప్రాయమైన కెరీర్ ఎక్కువగా పంజాబ్‌కే పరిమితమైనప్పటికీ, దేశవ్యాప్తంగా ఆయనకు గౌరవం ఉంది. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి" అంటూ ట్వీట్ చేశారు.

" ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణం పంజాబ్ మరియు దేశానికి తీరని లోటు. ఆయన అసాధారణమైన నాయకత్వం, దార్శనికత, ప్రజల సంక్షేమం పట్ల అచంచలమైన అంకితభావంతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులు ధైర్యంగా ఉండాలి. ఓం శాంతి!" అని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ట్వీట్ చేశారు.

prakashsingh

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకాష్ సింగ్ బాదల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. " ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణించడం చాలా బాధాకరం. ఆయన భారతదేశ రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి. మన దేశానికి గొప్పగా దోహదపడిన గొప్ప రాజనీతిజ్ఞుడు. పంజాబ్ పురోగతికి అవిశ్రాంతంగా పనిచేశాడు. క్లిష్టమైన సమయాల్లో రాష్ట్రాన్ని అదుకున్నాడు" అని మోడీ ట్వీట్ చేశారు.

ప్రకాష్ బాదల్ మృతి పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల నేను తీవ్ర వేదన చెందినట్లు చెప్పారు. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటని అన్నారు. బాదల్ మృతి పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంతాపం తెలిపారు. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ జాతిపిత పద్మవిభూషణ్‌ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు.

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ మాజీ అధ్యక్షుడు సర్దార్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మరణవార్త బాధాకరమని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. "బాదల్ భారతదేశం, పంజాబ్ రాజకీయాలకు ముఖ్యమైన నాయకుడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో పాటు కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

95 ఏళ్ల ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం మొహాలీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. బాదల్ ఆదివారం శ్వాసం తీసుకోవడంలో ఇబ్బింది రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ ఉంచి చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రకాష్ సింగ్ బాదల్ ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+