వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమాషాగా ఉందా?: అవార్డు వాపసీపై రాష్ట్రపతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ ఆరోపణలు చేస్తూ అవార్డులు తిరిగిచ్చేస్తున్న రచయితలు, ఫిల్మ్ మేకర్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నెర్ర చేశారు. న్యూఢిల్లీలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

'ప్రతిష్టాత్మక అవార్డులు.... వృత్తిలో వారి యొక్క ప్రతిభను, మెరిట్‌ను గుర్తించి ఇచ్చిన ప్రజా గుర్తింపు. అలాంటి అవార్డులను అందుకున్న వారు తిరిగి ఇవ్వడం సరికాదు. భావాలను అదుపులో ఉంచుకోవాలి' అని సూచించారు. 'సమాజంలో జరిగిన ఘటనల వల్ల కొన్నిసార్లు మృదువైన భావాలు చెదురుతాయి. ఆందోళన కలిగిన సందర్భంలో వాటి పట్ల భావాలను అదుపులో ఉంచుకోవాలి'
అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

Pranab Mukherjee

చర్చల ద్వారా విభేదాలను తెలియాలని సూచించారు. సమయం వచ్చినప్పుడల్లా ఆత్మపరిశోధన చేసుకొని తన తప్పులను తాను సరిదిద్దుకోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని ప్రణబ్ అన్నారు. '21వ శతాబ్దంలో శక్తిమంతమైన, వైభవోజ్వలమైన భారత్‌ కోసం స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నరు.

'రాజ్యాంగం పట్ల భారతీయులకు ఉన్న విలువులపై ఎప్పుడూ గౌరవంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భారతీయులు స్వేచ్ఛకు భంగం వాటిల్లలేదు' అని అన్నారు. ప్రజాప్రయోజనాలు రక్షించడంలో, అట్టడుగు వర్గాలకు అండగా నిలువడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఇటీవల కాలంలో కన్నడ రచయిత కల్బుర్గీపై హత్య చేయడం, యూపీలో గోమాంసం తిన్నాడనే ఆరోపణలతో ఓ ముస్లింపై దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ రచయితలు, సినిమా కళాకారులు అవార్డులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.

English summary
After making his interventions on the raging debate on intolerance, President Pranab Mukherjee on Monday called on India's writers and filmmakers, who have returned their awards recently, to instead cherish their recognition and resolve matters through debate and discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X