Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు షాకిస్తూ.. ద్రౌపది ముర్ముకు ఆ రెండు పార్టీల మద్దతు

న్యూఢిల్లీ: విపక్షాలకు మరో షాక్ తగిలింది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ భాగస్వామి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి), మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) శుక్రవారం రాష్ట్రపతి ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

ఎస్ఏడీ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డి దేవెగౌడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో సంభాషించిన తర్వాత ఈ పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి.

 Presidential Polls 2022: SAD And JD(S) Announce Support For NDA’s Nominee Draupadi Murmu

అంతకుముందు రోజు, చండీగఢ్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ముర్ముకి మద్దతునిస్తూ ఎస్ఏడీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలోని పేద, గిరిజన వర్గాలకు ఆమె ప్రతీకగా ఎదిగారని తీర్మానం పేర్కొంది.

ముర్ముకు మద్దతు కోరేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బాదల్‌ను సంప్రదించిన ఒక రోజు తర్వాత ఎస్ఏడీ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీకి పాత మిత్రపక్షాలలో ఒకటైన ఎస్ఏడీ.. రైతుల బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 2020లో ముందుగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నిలబెట్టాయి. సిన్హా 2018లో బీజేపీని వీడి గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు.

రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగుతాయని, మూడు రోజుల తర్వాత జూలై 21న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) గత నెలలో ప్రకటించింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది.

రాజ్యాంగం ప్రకారం, పదవీకాలం ముగియకముందే కొత్త రాష్ట్రపతిని నియమించాలి. 776 మంది పార్లమెంటు సభ్యులు, 4,033 మంది శాసన సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
నామినేటెడ్ ఎంపీలు, శాసనమండలి సభ్యులకు ఓటు వేసేందుకు అనుమతి లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+