రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికే: సోనియా-అఖిలేష్‌లకు ములాయం షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: సమాజ్ వాది పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య ఇంకా విభేదాలు ముగియలేదా? అంటే అవుననే అంటున్నారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్, కొడుకు అఖిలేష్‌ల మధ్య విభేదాల మరోసారి కనిపిస్తున్నాయి.

ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేశాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ములాయం మరో షాకింగ్ ప్రకటన చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎన్డీయేకు మద్దతిస్తామని ములాయం చెప్పారు. ఇది అఖిలేష్‌కు అలాగే సోనియా గాంధీకి షాక్ అని చెప్పవచ్చు.

Presidential polls: Will support NDA candidate, Mulayam Singh Yadav says

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష కూటమికి ఇది పెద్ద దెబ్బ. ఆయన నిర్ణయంతో కాంగ్రెస్ కూటమి కంగుతింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న బిజెపి అన్ని పార్టీలకు చెందిన నేతలను వరుసగా కలుస్తూ వస్తోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు ములాయం సింగ్‌ను కలిశారు.

ఈ సందర్భంగా తన మద్దతు ఎన్డీయే అభ్యర్థికేనని ములాయం వారికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ మాత్రం కాంగ్రెస్‌తోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ignoring former CM Akhilesh Yadav's reservations, his father and Samajwadi Party patriarch Mulayam Singh Yadav has assured NDA leaders of his party's support in the presidential polls with the rider that the candidate should not be a strong saffron face and be acceptable to all.
Please Wait while comments are loading...